close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/02/2020 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పీడ్‌బ్రేకర్లకు రంగు.. కేంద్రమంత్రి ప్రశంస

పనాజీ: రోడ్డు ప్రమాదాల నివారణకు గోవాకు చెందిన కొందరు యువకుల బృందం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. రోడ్డుపై వేగంగా వెళుతున్నప్పుడు స్పీడ్‌ బ్రేకర్లు గమనించకపోవడం వల్ల వాహనదారులు ఒక్కోసారి ప్రమాదాలకు గురౌతున్నారు. దీన్ని గుర్తించిన ఆ బృందం సుమారు 130 స్పీడ్‌ బ్రేకర్లకు రంగులు వేసి ఏకంగా కేంద్రమంత్రి ప్రశంసలు అందుకుంది.

రోస్టాగోవా పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సామాజిక కార్యకర్త సిసెల్లి రోడ్రిగస్‌ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలకు స్పీడ్‌బ్రేకర్లేకారణమవుతున్నాయని, దీంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు. తనలాంటి వారు ఎంతోమంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, సోషల్‌మీడియా ద్వారా మరింత మంది తోడ్పాటునందించారని చెప్పారు. గతంలో తాను కూడా స్పీడ్‌బ్రేకర్‌ కారణంగా ప్రమాదానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. వీరు చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ బృందంపై ట్విటర్‌ వేదికగా ప్రశంసలు గుప్పించారు. గోవా ఫార్వార్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ) అధ్యక్షుడు విజయ్‌ సర్దేశాయ్‌ సైతం ప్రశంసించారు. త్వరలో అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.