close

తాజా వార్తలు

Published : 23/01/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీవో 77 రద్దు చేయాలి: చంద్రబాబు

అమరావతి: జీవో 77 పేద విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. సమస్యలపై నిరసన తెలియజేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు.

 జీవో 77 రద్దు కోరుతూ ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులను వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. నాడు కేజీ టూ పీజీ ఉచితం అంటూ ఊదరగొట్టారని, నేడు పీజీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌  రద్దు చేస్తారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రచార ఆర్భాటం తప్ప మేలు చేసే ఆలోచన ఏ కోశానా లేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారన్నారు. తెదేపా పథకాలకు పేర్లు మార్చి హడావుడి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఇవీ చదవండి..
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

‘వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలి’



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని