close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120060429 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => scC2morSR_s [video_short_link] => scC2morSR_s [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-05-05 13:43:25.712596 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 05/05/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయ్‌.. నీలా నేనూ బాధపడ్డా: చిరంజీవి

‘కిల్‌ ఫేక్‌ న్యూస్‌’.. ‘నీ వెంట మేమున్నా’మంటున్న ప్రముఖులు

హైదరాబాద్‌: సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్‌, రవితేజ, రానా తదితరులు యువ హీరో విజయ్‌ దేవరకొండకు మద్దతు తెలిపారు. కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు వార్తలు రాసి ప్రజలపై రుద్దుతున్నాయని సోమవారం విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమపై వదంతులు రాయడాన్ని ఖండిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు స్పందిస్తూ.. ‘కిల్‌ ఫేక్‌ న్యూస్‌’ అంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు చేశారు. విజయ్‌ వెంట మేమున్నామంటూ మద్దతు పలికారు.

‘ప్రియమైన విజయ్‌.. నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేమంతా నీకు అండగా ఉన్నాం. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని వార్తగా ప్రచారం చేయొద్దని పాత్రికేయ స్నేహితుల్ని కోరుతున్నా’ అని చిరు ట్వీట్‌ చేశారు.

‘ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగం, అంకితభావంతో ప్రజల ప్రేమ, గౌరవం పొందుతాం. ఓ మంచి భర్తగా, తండ్రిగా, అభిమానులకు నచ్చిన స్టార్‌గా ఉండేందుకు కృషి చేస్తాం. కానీ గుర్తింపులేని కొందరు వ్యక్తులు డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మన గౌరవం పోగొట్టేందుకు అబద్ధాలు రాసి, వాటిని ప్రజలతో చదివిస్తారు. ఇలాంటివి సాధారణమని భావించే ప్రపంచం నుంచి మన అందమైన తెలుగు చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని, నా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలి అనుకుంటున్నా. ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమకు పిలుపునిస్తున్నా’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ‘విజయ్‌ నీ వెంట నేనున్నా’నంటూ ట్వీట్‌ చేశారు.

పూరీ స్పందిస్తూ.. ‘నువ్వు ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్‌. దీని కోసం నీ డబ్బు, సమయాన్ని కేటాయించావు. నిన్ను గౌరవిస్తున్నాం. ఇది మనం పోరాడాల్సిన సమయం. నువ్వే నా ఫైటర్‌. మా మద్దతు నీకు ఉంటుంది’ అని పోస్ట్‌ చేశారు.

‘విజయ్‌ దేవరకొండ చాలా బాగా మాట్లాడావు. నీ వెంట నేనున్నా’ అని రానా దగ్గుబాటి పేర్కొన్నారు. కొరటాల శివ, రవితేజ, రాధిక, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, అల్లరి నరేష్‌, క్రిష్‌, రాశీ ఖన్నా, వంశీ పైడిపల్లి, మధుర శ్రీథర్‌ రెడ్డి, స్మిత తదితరులు విజయ్‌కు మద్దతు తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.