close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/07/2020 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాయిలర్‌ పేలి నలుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎల్‌సీ)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్‌-5లో బాయిలర్‌ పేలడంతో నలుగురు మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్‌ఎల్‌సీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాయిలర్‌ వినియోగంలో లేదని.. అయినా ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నామని సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత బాయిలర్‌ను పునరుద్ధరిస్తున్న క్రమంలోనే ఈ ఘటన సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. గత నెలలో ఇదే పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కడలూర్‌ జిల్లాలో ఉన్న ఈ ఎన్‌ఎల్‌సీ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 3,940 మెగావాట్లు. ప్రస్తుతం ఘటన జరిగిన ప్లాంట్‌ సామర్థ్యం 1,470 మెగావాట్లు. కంపెనీలో ప్రస్తుతం 27,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 15,000 మంది ఒప్పంద ప్రాతిపదికన నియమితులైనవారే.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.