
తాజా వార్తలు
ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడింది: భాజపా
హైదరాబాద్: పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఎస్ఈసీతో సమావేశం అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ పాతబస్తీలో మజ్లీస్‌పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని మేం చెప్పాం. సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా పోలింగ్ పెరిగింది. ఘాన్సీబజార్‌లో పోలింగ్ స్టేషన్ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌లో పోలింగ్ స్టేషన్ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్ జరిగింది. వెంటనే మా పార్టీ అభ్యర్థి రిటర్నింగ్ ఆఫీసర్‌తో పాటు, ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. రీపోలింగ్ జరపాలని కోరారు. ఎన్నికల పరిశీలకుల ద్వారా విచారణ జరిపించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ చెప్పారు’’ అని రామచంద్రరావు వెల్లడించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
