ఒక్కొక్కటిగా బయట పెడతాం: బండి సంజయ్‌
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 19:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కొక్కటిగా బయట పెడతాం: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని.. సీఎం కేసీఆర్ అప్పుడెందుకు విచారణ జరిపించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మంత్రులపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయో.. వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే ప్రభుత్వంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. వాటికి బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి కేసీఆర్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏ శాఖలో ఎక్కువ డబ్బులు ఉంటే ఆ శాఖను సీఎం తీసుకుంటారని ఆరోపించారు. గతంలో నీటిపారుదల శాఖ, ఇప్పుడు వైద్యారోగ్య శాఖను తనకు బదిలీ చేయించుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారన్నారు.

‘‘హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి 421 ఎకరాల భూమిని కబ్జాచేసి గిరిజనులపై దాడులు చేయించాడు. ఇది సీఎంకు తెలియదా?ఇది నిషేధిత స్థలం.. ఇక్కడ నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పిన మున్సిపల్ కమిషనర్‌ను బెదిరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా ఇల్లే కట్టుకున్నారు. బొమ్మల రామారం, రాజంపేట మండలాల్లో ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఇలా తెరాసకు చెందిన 77 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నాయి. వారిపై వెంటనే యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపించాలి. తెరాస నేతల పూర్తి చిట్టాను బయటకు తీస్తున్నాం. ఒక్కొక్కటిగా బయట పెడతాం’’ అని బండి సంజయ్‌ అన్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని