close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/03/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆటో బోల్తా: నలుగురు మృతి

శ్రీకాకుళం: ఆటో బోల్తా పడి నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని బైరికూడలిలో శనివారం రాత్రి జరిగింది. మృతుల్లో తండ్రి కొడుకులు ఉన్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురుకి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులు నరసన్నపేటలో జరిగిన తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం మండలం బైరికూడలి వద్దకు రాగానే ఆటో బోల్తా పడింది. దీంతో తండ్రి కొడుకులు వెంకటి, సింహాచలంతో పాటు శ్రీలత అనే మహిళ అక్కడిక్కడే మృతిచెందారు. గణేష్ అనే వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.