close

తాజా వార్తలు

Updated : 24/01/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్‌ మార్పు

దిల్లీ: పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్‌ మారింది. తొలుత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటిషన్‌ ఉండగా.. తాజాగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ బెంచ్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉద్యోగ సంఘాలు సైతం వేరే పిటిషన్‌ దాఖలు చేశాయి.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సైతం ఇప్పటికే కేవియట్‌ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ విచారణలో తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్‌ ద్వారా ఎస్‌ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రేపు ఉదయం 11 గంటల తర్వాత ఈ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశముంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసిన నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి..

ప్రతిష్టంభన!
ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు

 




Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
జాతీయ- అంతర్జాతీయ
పాలిటిక్స్
సినిమా
క్రీడలు
క్రైమ్