మహేష్‌ చిత్రంతో ‘విద్యాదీవెన’
close

తాజా వార్తలు

Published : 26/02/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేష్‌ చిత్రంతో ‘విద్యాదీవెన’

ఎమ్మిగనూరు పురపాలికలో విచిత్రం

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు చిత్రం, ఓ యువతి చిరునామాతో విద్యా దీవెన కార్డు అందజేయడం చర్చనీయాంశమైంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన గంగమ్మ, సత్యన్నల కుమార్తె పరంపోగు లక్ష్మి ఇక్కడి సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చదువుతోంది. ఆమెకు విద్యా దీవెన కింద 2019-057--145-21 సంఖ్యతో గుర్తింపు కార్డు మంజూరు చేశారు. కార్డులో విద్యార్థిని పేరు, చిరునామా సక్రమంగానే ఉన్నప్పటికీ యువతి చిత్రానికి బదులు హీరో మహేష్‌బాబు ఫొటో ప్రచురితమైంది. ఇందులోని సెల్‌ఫోన్‌ నంబరు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నారాయణపేటకు చెందిన కరుణాకర్‌ పేరిట ఉంది. కొన్ని కార్డుల్లో తప్పులు దొర్లాయని కమిషనర్‌ రఘునాథరెడ్డి వివరణ ఇచ్చారు. యువతికి కొత్త కార్డు అందేలా చూస్తామన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని