తెగి ఎగిరిపడిన తల..
close

తాజా వార్తలు

Updated : 22/05/2020 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెగి ఎగిరిపడిన తల..

 ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన డోజర్‌
 అకోలా-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘటన

అల్లాదుర్గం: మరో నిమిషంలో ఆ వ్యక్తి తాను పనిచేసే రైస్‌మిల్లుకు చేరేవారు. ఇంతలో విధి వక్రించి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ డోజర్‌ తగలడంతో అనుకోని రీతిలో తల మొండెం వేరై అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా పరిధిలోని హైదరాబాద్‌-అకోలా జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూరు గ్రామానికి చెందిన దుర్గయ్య (45) అల్లాదుర్గం మండలంలోని రాంపూర్‌ శివారులో ఉన్న రైస్‌మిల్లులో గుమస్తాగా పని చేస్తున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆయన పనిచేసే రైస్‌మిల్లుకు కూత వేటు దూరంలో అదే రైస్‌మిల్లులో వరి పొట్టు నింపే ట్రాక్టర్‌ డోజర్‌ ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో మొండెం నుంచి తల ఎగిరి 5 మీటర్ల దూరంలో పడింది. ట్రాక్టర్‌ డోజర్‌ డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న దుర్గయ్య భార్య సావిత్రి, కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని మొండెం నుంచి వేరైన తలను ఎదురుగా పెట్టుకుని రోదించడం అక్కడి వారిని కలచివేసింది. దుర్గయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని