close

తాజా వార్తలు

Published : 31/07/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వచ్చిందని యువకుడి ఆత్మహత్య!

కమలాపురం (కడప): కరోనా పాజిటవ్‌ అని నిర్థరణ కావడంతో 22 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కమలాపురం మండలంలోని రాజుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఆ యువకుడికి ఉండడంతో కరోనా పరీక్షలకు రాజుపాలెం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నాడు. బుధవారం వెలువడ్డ ఫలితాల్లో ఆ యువకుడికి కరోనా పాజిటవ్ అని నిర్థరణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడిని హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. గురువారం కమలాపురంలో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని బస్సు రాగా ఆ యువకుడి తల్లిదండ్రులు బస్సు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కమలాపురం ఎస్సై రాజా రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.