close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120001416 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => nYNY7kVzPX0 [video_short_link] => nYNY7kVzPX0 [created_by] => [created_date] => [modified_by] => 8925593 [modified_date] => 2020-01-03 16:16:51.046927 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 03/01/2020 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ టీజర్‌ వచ్చేసిందోచ్‌..!

హైదరాబాద్‌: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా టీజర్‌ వచ్చేసింది. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. ‘మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు’ ఫేం క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ కథానాయికలు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వరుసగా నాలుగు పోస్టర్లను విడుదల చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. రాశీ, ఐశ్వర్య, కేథరిన్‌, ఇజబెల్లె.. ఈ నలుగురు విజయ్‌ సరసన కనిపించడం దీనికి కారణం. దీంతో ఈ సినిమా కథపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

‘ప్రేమంటే రాజీ గౌతమ్‌.. ప్రేమంటే త్యాగం.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావు..’ అని ఓ అమ్మాయి అంటున్న డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది. విజయ్‌ నలుగురు కథానాయికలతోనూ అన్యోన్యంగా ఉంటూ కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో మరో ‘అర్జున్‌ రెడ్డి’ గుర్తొచ్చాడు. టీజర్‌లో కథ చెప్పే ప్రయత్నం చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.