close

తాజా వార్తలు

Updated : 05/06/2020 13:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాక్‌డౌన్‌ ప్రకృతి పరిరక్షణకు అవకాశం ఇచ్చింది

దిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన  ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ‘మన్‌కీ బాత్‌’ కార్యక్రమంలో పర్యావరణంపై మాట్లాడిన వీడియోను మోదీ పోస్టు చేశారు.

‘‘పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. భూమిపై ఉన్న వృక్షాలు, జంతువులను కాపాడేందుకు మనమంతా సమష్టిగా కృషి చేయాలి. రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి’’ అని మోదీ సూచించారు.

‘ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్‌ ‘జీవ వైవిధ్యం’. గత కొన్ని వారాలుగా విధించిన లాక్‌డౌన్‌తో జీవితంలో వేగం కొంచెం తగ్గింది. కానీ, లాక్‌డౌన్‌ మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిరక్షించేందుకు మనకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టాలి. ముఖ్యంగా వర్షపు నీటిని వృథా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో వస్తున్న కొత్తపోకడలు విసురుతున్న సవాళ్లను అధిగమిస్తూ.. చెట్లను పెంచడం, ఇంధనాలను, రసాయనాలను విచక్షణతో ఉపయోగించడం, సైకిళ్లను వినియోగిండచం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణహిత అభివృద్ధి దిశగా ముందుకు సాగడంలో ప్రజల బాధ్యత అతి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో మానవ జాతి మనుగడ కోసం పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరముందని వెంకయ్య అన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని