టీవీలో ప్రకటనల కోసమే పనిచేస్తున్నారా?
close

తాజా వార్తలు

Published : 22/07/2020 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీవీలో ప్రకటనల కోసమే పనిచేస్తున్నారా?

కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ గంభీర్‌

దిల్లీ : భాజపా ఎంపీ గౌతం గంభీర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేజ్రీవాల్‌పై వరుసగా విమర్శలు చేస్తున్న గంభీర్‌ మరోసారి విరుచుకుపడ్డారు. దిల్లీలో కరోనా విజృంభిస్తున్న వేళ.. ఓ కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రం ఇంకా పనిచేయడం లేదంటూ విమర్శించారు.

‘కాంతినగర్‌లోని జీజీఎఫ్‌ కొవిడ్‌-19 కేంద్రం ఇప్పటికీ మూసివేసే ఉంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌లో మీరు హామీ ఇచ్చినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీవీలో కనిపించడం కోసం, ప్రకటనల కోసమే పనిచేస్తున్నారా?. వెంటనే వచ్చి దాన్ని ప్రారంభించండి. రాజకీయాలు చేయడానికి మనకు మొత్తం జీవితం ఉంది’ అంటూ తూర్పు దిల్లీ ఎంపీ అయిన గంభీర్‌.. కేజ్రీవాల్‌పై  ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ఖాళీగా ఉన్న ఆ కొవిడ్‌ కేంద్రం ఫొటోలనూ జత చేశారు.

ఈ కొవిడ్‌ సెంటర్‌ను గౌతమ్‌ గంభీర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించి ప్రభుత్వానికి జులై 7న అందించారు. 50 పడకలు, 30 ఆక్సిజన్‌ సిలిండర్లతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండే సౌకర్యం లేని వారు దీన్ని ఉపయోగించుకోవచ్చని గంభీర్‌ తెలిపారు. ఈ నెల 16న కేజ్రీవాల్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కేంద్రానికి అనుమతి ఇవ్వాలని గంభీర్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని