close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/07/2020 11:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్య శాంపిళ్లను పనిమనిషి పేరిట పంపి..

బుక్కయిన ప్రభుత్వ వైద్యుడు

భోపాల్‌ : తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ వైద్యుడి చేసిన నిర్వాకం అతడిపై పోలీసు కేసు నమోదయ్యేటట్లు చేసింది.  కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపి పోలీసులకు చిక్కాడు ఆ వైద్యుడు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు..

సింగ్రౌలి ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లికి హాజరయ్యాడు. పై అధికారులు సెలవులు ఇవ్వకపోయినప్పటికీ యూపీకి వెళ్లాడు. జూన్‌ 23న వివాహానికి హాజరై.. జులై 1న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉండక.. విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత తన భార్యలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. అయితే ఆమెకి నిర్ధారణ పరీక్షలు చేయిస్తే.. తాను యూపీ వెళ్లి వచ్చిన విషయం బయటపడుతుందని ఓ ఉపాయం ఆలోచించాడు. తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపించాడు.

అయితే పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు పనిమనిషి ఇంటికి చేరడంతో.. ఆ వైద్యుడి మోసం బయటపడింది. అనంతరం అతడి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వైద్యుడితోపాటు ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఇతరుల పేరుతో శాంపిళ్లను పంపినందుకు ఆ వైద్యుడిపై ‘ఎపిడమిక్‌ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. అతడు ఆస్పత్రి నుంచి కోలుకుని తిరిగి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఆ వైద్యుడికి కరోనా సోకిన కారణంగా అతడి కార్యాలయంలో పనిచేసే 33 మంది సిబ్బంది ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.