close

తాజా వార్తలు

Published : 30/05/2020 08:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ బస్సులో ప్రయాణించినవారెవరు?

రాజమహేంద్రవరం : బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అతనితోపాటు ఆ బస్సులో ప్రయాణించినవారి వివరాలను ఆర్టీసీ అధికారుల నుంచి శ్రీకాకుళం పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నెల 23న విజయవాడ నుంచి శ్రీకాకుళానికి ప్రయాణం చేసిన వ్యక్తి రాజమహేంద్రవరం, విశాఖపట్నం డిపోల్లో బస్సులు మారాడు. బస్సులో శ్రీకాకుళం వెళ్లిన తర్వాత అతడికి పరీక్ష చేయగా కరోనా పాటిజివ్‌గా తేలింది. శ్రీకాకుళం పోలీసులు అడిగిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండు నుంచి విశాఖకు అతనితోపాటు అదే బస్సులో ఎంతమంది ప్రయాణించారనే వివరాలను ఇక్కడి ఆర్టీసీ అధికారులు సేకరించారు. మొత్తం 14మంది ఆ రోజు విశాఖకు వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించినట్లు డీఎం మూర్తి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని