close

తాజా వార్తలు

Published : 05/12/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ నౌకలపై విశాఖ పోర్టు దృష్టి


ఇంటర్నెట్‌ డెస్క్: తీరానికి అతిభారీ నౌకలను తీసుకురావటంపై విశాఖ పోర్టు ట్రస్టు దృష్టి సారించింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా వాటిని ఇన్నర్‌ హార్బర్‌లోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోంది. అందుకు అనుగుణంగా అధిక సామర్థ్యం ఉన్న టగ్‌లను ఉపయోగిస్తున్నారు. మౌలిక, వ్యాపార కార్యకలాపాల పెంపులో భాగంగా ఇతర పోర్టులకు దీటుగా ప్రణాళికను సిద్ధం చేశారు.

విశాఖ పోర్టులో ఇప్పటివరకు మధ్య స్థాయి నౌకలు మాత్రమే ఇన్నర్‌ హార్బర్‌లోకి వచ్చేవి. 230 మీటర్ల పొడవు, 32.5 మీటర్ల వెడల్పు ఉన్న నౌకలే రాగలిగేవి. 2019లో సింగపూర్‌లో అనుకరణా అధ్యయనం చేయించారు. అప్పటి నుంచి ఇన్నర్‌ హార్బర్‌లోకి  260 మీ. పొడవు, 45 మీటర్ల వెడల్పు, 290 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు ఉండే నౌకలను 15.20 మీటర్ల డ్రాఫ్ట్‌ వద్ద నిర్వహించే అవకాశం కలిగిందని పోర్టు ట్రస్టు ఛైర్మన్‌ రామమోహన రావు తెలిపారు.

‘సింగపూర్‌‌లో నిర్వహించిన అనుకరణ అధ్యయనం ద్వారా భారీ పరిమాణం ఉన్న నౌకలు సైతం ఇన్నర్ హార్బర్‌లోకి తెచ్చే అవకాశం కలిగింది. 38 మీటర్ల బీమ్ ఉన్న నౌకను తీసుకువచ్చారు. భవిష్యత్తులో 42, 44 మీటర్ల బీమ్‌ ఉన్న ఓడలనూ తీసుకువస్తాం’ అని రామమోహనరావు వివరించారు.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన