నా లాంటి ‘సున్నా’ విద్యార్థులకు.. : సెహ్వాగ్‌ 
close

తాజా వార్తలు

Updated : 05/09/2020 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా లాంటి ‘సున్నా’ విద్యార్థులకు.. : సెహ్వాగ్‌ 

వాళ్లే లేకపోతే.. ఇలా ఉండేవాడిని కాదు.. గౌతమ్‌ గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌లో తనదైనశైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘నాలాంటి ‘సున్నా’ విద్యార్థులకు దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పారు. ప్రతీ అంకెకూ ఆ సున్నాని జోడిస్తే అదెంత విలువ పెరుగుతుందో వివరించారు. మీలాంటి ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. అలాగే మాజీ బ్యాట్స్‌మన్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా స్పందించాడు. ‘నాకు చదువు చెప్పిన వాళ్లందరూ లేకపోతే ఇలా ఉండేవాడిని కాదు’ అని పేర్కొన్నాడు.

ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ తనకిష్టమైన కోచ్‌ అచ్రేకర్‌తో పాటు గురువు సమానంతో భావించే తన తండ్రి, సోదరుల ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా టీచర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుత కొవిడ్‌-19 పరిస్థితుల్లో పాఠశాలలు మూత పడ్డాయని, అయినా.. ఉపాధ్యాయులు మాత్రం ఆన్‌లైన్‌లో తరగతులు చెబుతున్నారని వారి సేవలను కొనియాడారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సచిన్‌ అన్నారు. మరోవైపు ఈ రోజు విశిష్టతను పురస్కరించుకొని పలు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు సైతం స్పందించాయి. తమ ట్వీట్లలో ఆయా జట్ల కోచ్‌లు, సహాయక సిబ్బంది ఫొటోలు పంచుకొని వారికి హ్యాపీ టీచర్స్‌ డే అంటూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని