close

తాజా వార్తలు

Published : 22/03/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమెతో పనిచేయాలనుంది: విజయ్‌ దేవరకొండ 

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనూ క్రేజ్‌ సంపాదించుకున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఆయనకు హిందీలోనూ అభిమానులు ఏర్పడ్డారు. అక్కడి ప్రజలు సైతం విజయ్‌ గురించి మాట్లాడుతున్నారు. పూరీ జగన్నాథ్‌ పాన్‌-ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ‘ఫైటర్‌’లో విజయ్‌ నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అనన్యా పాండే కథానాయిక. పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు బాలీవుడ్‌లో ఎవరితో కలిసి పనిచేయాలని ఉంది?అని విజయ్‌ని అడగ్గా.. తనకు ప్రత్యేకంగా ఫలానా వారితో కలిసి పనిచేయాలని లేదని అన్నారు. కానీ ఎవర్నైనా ఎంచుకోమని చెబితే.. కియారా అడ్వాణీ, జాన్వి కపూర్‌ పేర్లు చెబుతానని అన్నారు. ఏ చిత్ర పరిశ్రమకు చెందిన ఏ నటిని నా సినిమా కోసం ఎంపిక చేసినా తనకేం సమస్య లేదని చెప్పారు. కియారా అడ్వాణీ, విజయ్‌ కలిసి ఓ దుస్తుల బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం వీరిద్దరూ కలిసి ప్రకటనలో పనిచేశారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో విజయ్‌ను జాన్వి ప్రశంసించారు. ఆయనతో కలిసి పనిచేయాలని ఉందన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని