close

తాజా వార్తలు

Published : 22/06/2020 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూలుక్‌: ఫొటోలు వైర‌ల్‌

హైద‌రాబాద్‌: యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త లుక్‌లో క‌నిపించి అందర్నీ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న తండ్రితో క‌లిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణ‌యం తీసుకు‌న్నా.. త‌ప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహ‌సాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నాన‌ని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు డాడీ.. ఐ ల‌వ్ యూ..’ అని విజ‌య్ పోస్ట్ చేశారు.

అయితే అందులో ఆయ‌న పూర్తి విభిన్న‌మైన లుక్‌లో క‌నిపించారు. జుట్టు పెంచుకుని, ప్ర‌త్యేకమైన గడ్డంతో కనిపించారు. దీంతో ఈ ఫొటో కాస్త వైర‌ల్‌గా మారింది. అంతేకాదు ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో తీసుకున్న ఫొటోలు కూడా సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ‘ఫైట‌ర్’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసం ఆయ‌న స‌రికొత్త‌ లుక్‌లో సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

‘వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్’ త‌ర్వాత విజ‌య్ ‘ఫైట‌ర్’‌లో న‌టిస్తున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కుడు. క‌ర‌ణ్ జోహార్ సహ నిర్మాత‌. బాలీవుడ్ న‌టి అన‌న్యా పాండే క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమా క‌చ్చితంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంటుంద‌ని చిత్ర బృందం గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని