close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 18/03/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లవ్‌లైఫ్‌ను సీక్రెట్‌గా ఉంచుతా:విజయ్‌ దేవరకొండ

అలా అవ్వాలని భావించడం లేదు

హైదరాబాద్‌: టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ తన లవ్‌ లైఫ్‌ గురించి స్పందించారు. తాజాగా విడుదలైన ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ జాబితాలో విజయ్‌ దేవరకొండ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్‌ ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటిస్తూ.. తన ప్రేమ జీవితం గురించి స్పందించారు. ‘మీ జీవితంలోని లవ్‌లైఫ్‌ను కనిపెట్టగలిగారా?’ అని ప్రశ్నించగా.. విజయ్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘నో కామెంట్స్‌. ఒక వేళ నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాసరే ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతాను. రిలేషన్‌షిప్‌ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది. అది ఎవరి వ్యాపారం కాదు. నేను నా తల్లిదండ్రులకు, స్నేహితులకు చెబుతాను. అలాగే ఈ ప్రపంచానికి కూడా ఒకరోజు చెబుతాను. కానీ దానికి సమయం ఉంది. నా జీవితం వేరొకరికి వినోదంగా మారాలని నేను భావించడం లేదు’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ఇందులో విజయ్‌ దేవరకొండ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. విజయ్‌ దేవరకొండ సరసన అనన్యపాండే నటిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ నటించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలను అందుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.