close

తాజా వార్తలు

Published : 12/02/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లా.. సిద్ధంగా లేను: విజయ్ దేవరకొండ

హైదరాబాద్‌: ‘పెళ్లి చూపులు’ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’ సినిమాలతో అమ్మాయిల్లో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు టాలీవుడ్‌ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌, ఇజబెల్లె లైట్‌, కేథరిన్‌ కనిపించనున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ప్రమోషన్స్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెళ్లి ప్లాన్స్‌ గురించి విజయ్‌ని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం పెళ్లి చేసుకోడానికి సిద్ధంగాలేనని తెలిపారు. ‘వివాహబంధంపై నాకెంతో గౌరవం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం అందుకు నేను సిద్ధంగా లేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్‌ను ప్రేమిస్తున్నాను. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాను’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని