close

తాజా వార్తలు

Updated : 31/07/2020 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ-మొబైల్‌ వాహనాల ద్వారా విద్యాబోధన  

ఏపీ మంత్రి సురేశ్

విజయవాడ: ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో లేని గ్రామాల్లో విద్యార్థుల కోసం విద్యావారధి వాహనాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యావారధి ద్వారా డిజిటల్‌ విద్యను అందించనుంది. ఈ వాహనాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యావారధి పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌-19 నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ అందుబాటులో ఉండవు. ఇందుకు పరిష్కార మార్గంగా విద్యావారధి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో కూడిన ఈ-మొబైల్‌ వాహనాల ద్వారా గ్రామాల్లోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఈ వాహనంలో చిన్న లైబ్రరీ, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ అందులో పొందుపర్చాం. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కొండ ప్రాంతాల్లో ఈ-మొబైల్‌ వ్యాన్‌లను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది’’ అని మంత్రి వివరించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.