close

తాజా వార్తలు

ఆ తేజస్సు అలా అంతర్థానం!

నేడు మధ్వనవమి


భారతీయ దర్శనాల్లో మూడు ముఖ్య సిద్ధాంతాల్లో ద్వైతం ఒకటి. దాన్ని సూత్రీకరించి, ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞులు మధ్వాచార్యులు. వేదాలకు సరికొత్త భాష్యాన్ని రచించిన ఆయన అంతర్థానమైన రోజును మధ్వనవమిగా పాటిస్తారు. ఆ రోజు మాఘశుద్ధ నవమి. మధ్వాచార్యులు ఉడుపి అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుగా భాష్యం చెబుతూ గడిపారు. పవిత్ర సయమంలో సకల దేవతా సమూహం పుష్పవృష్టి కురిపిస్తుండగా ఆయన భక్తులందరి సమక్షంలో సశరీరంగా అంతర్థానమయ్యారని చెబుతారు. ఈ సందర్భంగా ఉడుపి అనంతేశ్వరాలయంలో మాఘ శుద్ధపాఢ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. నవమి నాడు పర్యాయ పీఠాధిపతితో పాటు ఎనిమిది మంది పీఠాధిపతులూ సంస్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంత్రాలయంలో కూడా ఆ రోజు రథోత్సవం నిర్వహిస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.