close

తాజా వార్తలు

Updated : 21/11/2020 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి: ఉత్తమ్‌

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకుంటూ తెరాస ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మెట్రో రైలు పిల్లర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ ఆక్షేపించారు. ప్రజల పన్నులతో కట్టిన శౌచాలయాల మీద కూడా ప్రభుత్వ పథకాలపై  ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.67వేల కోట్లు ఖర్చు పెట్టామని తెరాస చెబుతోందని.. అయితే ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

భాజపా ఓట్లు ఎలా అడుగుతోంది?

‘‘కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందని ప్రజలను భాజపా ఓట్లు అడుగుతుంది. డబ్బుల సంచులతో కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లి కొనాలని చూస్తుంది. భూపేందర్ యాదవ్ వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేసేందుకే రాష్ట్రానికి వచ్చినట్లు ఉన్నారు. కొనుగోలు రాజకీయాలు మానుకొని హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి?మజ్లిస్‌, భాజపా మధ్య రహస్య ఒప్పందం ఉంది. ఈ రెండు పార్టీలూ మతతత్వ పార్టీలే’’ అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని