
తాజా వార్తలు
ఊర్మిళ ఇక శివ సైనికురాలు: సంజయ్ రౌత్
ముంబయి: బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరబోతున్నారని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ వెల్లడించారు. గతంలో కాంగ్రెస్లో చేరిన ఆమె.. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ పార్టీ వీడి సంవత్సరం గడిచిన తర్వాత ఇప్పుడు శివసేనలో చేరబోతున్నారు. డిసెంబరు 1న (మంగళవారం) ఊర్మిళ తమ పార్టీలో చేరబోతున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ‘‘ఆమె (ఊర్మిళ) శివ సైనికురాలు. రేపు మా పార్టీలో చేరబోతున్నారు. మా మహిళా సైన్యం ఇంకా బలపడబోతోంది’ అని చెప్పారు.
రాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ నామినేట్ చేసే 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఊర్మిళ పేరు కూడా ఉందని సమాచారం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే సమక్షంలో వారి నివాసంలో ఊర్మిళ శివసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది.