close

తాజా వార్తలు

ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న ఉద్ధవ్‌

ముంబయి : మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలో  ‘మహా వికాస్‌ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక  బాధ్యతల నుంచి ఉద్ధవ్‌ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌కు అప్పగించారు. సంజయ్‌ రౌత్‌ ప్రస్తుతం ఆ పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడిగా కొనసాగుతున్నారు. సామ్నా పత్రికను 1988లో బాల్‌ ఠాక్రే స్థాపించారు.
భారీగా ఏర్పాట్లు..
మరోవైపు ప్రమాణస్వీకారోత్సవానికి వేదికైన శివాజీ పార్క్‌లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలనుంచి ప్రముఖ నేతలు హాజరుకానున్నారని సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ఈ రోజు చరిత్రాత్మకమైన రోజని ఆయన అభివర్ణించారు. 

అజిత్‌ పవార్‌కు ఏ బాధ్యతలు..?
కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీలకు చెరో 15 మంత్రి పదవులు, కాంగ్రెస్‌ నుంచి 13 మందికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అయితే భాజపాకు మద్దతు ప్రకటించి రాత్రికి రాత్రే అనూహ్య పరిణామాలకు కేంద్ర బిందువైన అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రి పదవిని వదులుకుని తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొత్త ప్రభుత్వంలో ఏ బాధ్యతలు అప్పగించనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అజిత్‌ పవార్‌కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. అది పూర్తిగా ఎన్సీపీకి సంబంధించిన విషయమని తెలిపారు. ఒప్పందంలో భాగంగా ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి కేటాయించారని, అయితే అది ఎవరికి ఇవ్వాలన్నది ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఇష్టమేనని అన్నారు. 

ఈ సందర్భంగా ఆదిత్య ఠాక్రేకు మంత్రి పదవి ఇస్తారనే వార్తలపై కూడా రౌత్‌ స్పందించారు. కేబినెట్‌లో ఎవర్ని చేర్చుకోవాలి.. ఎవర్ని చేర్చుకోవద్దు అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని తెలిపారు. ఉద్ధవ్‌ ఠాక్రే ఇప్పుడు ఆదిత్య ఠాక్రేకు తండ్రి మాత్రమే కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.