close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/04/2020 09:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

16 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అక్కడ మృతుల సంఖ్య 10 వేల మార్క్‌ను చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో దాదాపు 95 శాతం జనాభాకు ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని గుర్తుచేశారు. అమెరికాలో మృతుల సంఖ్య 9,626కు చేరింది. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడింతలు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది మృత్యువాతపడ్డారు. ఇక కొత్తగా దాదాపు 23 వేల మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైరస్‌ బారినపడ్డవారి సంఖ్య 3,36,958కి చేరింది.

29 లక్షల డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్‌...

పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యల్ని ట్రంప్‌ వివరించారు. ప్రపంచదేశాల నుంచి మాస్కులు, చేతి తొడుగులు, ఇతర రక్షక సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో తాజా సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. హైడ్రోక్లోరోక్విన్‌ ఉపయోగాన్ని మరోసారి ధ్రువీకరించిన ట్రంప్‌.. దాదాపు 29 లక్షల డోసుల ఔషధాన్ని తెప్పించినట్లు వెల్లడించారు. రానున్న రెండు వారాలు అత్యంత కఠినంగా గడవనున్నాయని ట్రంప్‌ ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కమాండర్‌పై వేటు...

మరోవైపు అమెరికా నావికాదళానికి చెందిన కమాండర్‌ క్రోజియర్‌ని అమెరికా విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం యూఎస్ఎస్‌ రూజ్‌వెల్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన నౌకలో ఉన్న బలగాలను వైరస్‌ ముప్పు నుంచి కాపాడాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అది బయటకు రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన రక్షణ విభాగం క్రోజియర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వివరిస్తూ ఆయన్ని విధుల నుంచి బహిష్కరించింది. దీన్ని రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ సైతం సమర్థించడం గమనార్హం. కానీ, దేశంలోని పలు వర్గాలు కమాండర్‌ బహిష్కరణ వేటును తప్పుబడుతున్నాయి.

 

ఇవీ చదవండి...

ముంబయి నుంచి వచ్చింది...651 మంది!!

ఆసుపత్రిలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.