సంతకం ఇవాళే: ట్రంప్‌ వెల్లడి
close

తాజా వార్తలు

Published : 22/04/2020 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంతకం ఇవాళే: ట్రంప్‌ వెల్లడి

వాషింగ్టన్‌: అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఇవాళే సంతకం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అమెరికా పౌరుల ఉద్యోగాలను పరిరక్షించేందుకు, దేశంపై కరోనా వైరస్‌ చేస్తున్న అదృశ్య దాడిని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అంతకుముందు తెలిపారు. ఇది 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. 60 రోజుల తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమెరికా పౌరుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

వలసలపై నిషేధం 60 రోజులే: ట్రంప్‌

మా దేశానికి రావద్దు

మనోళ్లకు ఇబ్బందికరమే

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని