close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/05/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆంక్షల సడలింపుతో మరణాలు పెరగొచ్చు:ట్రంప్‌

వాషింగ్టన్‌: ఆంక్షల సడలింపులో తొందరపడొద్దన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల్ని పట్టించుకోకుండానే కొన్ని దేశాలు ఆ దిశగా పయనిస్తున్నాయి. ఇందులో అమెరికా ముందుంది. అయితే, తమ ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందని ట్రంప్‌ సైతం అంగీకరించడం గమనార్హం. ఆంక్షల సడలింపు వల్ల ప్రజలు ఇంటికే పరిమితమయ్యే అవకాశం లేదు కాబట్టి వైరస్ వ్యాప్తి పెరిగి మరణాలూ పెరగే అవకాశం ఉందని స్వయంగా ఆయనే వివరించారు. అయినా, ఆర్థిక వ్యవస్థనూ తెరవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

సొంత నిబంధనలకు విరుద్ధంగా..

ఫీనిక్స్‌లోని హనీవెల్‌ ఫ్యాక్టరీని మంగళవారం ట్రంప్‌ సందర్శించారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత ఆయన తొలి పర్యటన ఇదే. అయితే అక్కడ ఆయన మాస్క్‌ ధరించడానికి నిరాకరించడం గమనార్హం. ఫ్యాక్టరీని సందర్శించేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలన్న నిబంధనల ఉన్నప్పటికీ.. ఆయన దాన్ని పాటించలేదు. తొలి నుంచి ఆయన మాస్కును ధరించడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. అయితే, లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి బయటి పర్యటనకు వస్తున్న వేళ శ్వేతసౌధం నిబంధనల ప్రకారం మాస్కు ధరిస్తారని భావించారు. గతవారం ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సైతం ఓ పర్యటనలో మాస్కు ధరించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

టాస్క్‌ఫోర్స్‌కు స్వస్తి!

అమెరికాలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌కు స్వస్తి పలికే దిశగా చర్చలు జరుపుతున్నట్లు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతల్ని సంబంధిత సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నామన్నారు. ట్రంప్‌ సైతం వీటిని ధ్రువీకరించారు. దేశంలో సాధారణ కార్యకలాపాలు క్రమంగా పంజుకుంటున్నాయని తెలిపారు. దీనిలో టాస్క్‌ఫోర్స్‌ కృషి మరువలేనిదని కొనియాడారు. అమెరికాలో ఒక దశ ముగిసిందని.. ఇప్పుడు పోరులో రెండో దశకు చేరుకున్నామని అభిప్రాయపడ్డారు. కరోనా కేసుల స్థిరంగా నమోదవుతున్నాయని తెలిపారు. క్రమంగా కేసుల్ని తగ్గిస్తూ.. ఎకానమీ పునరుద్ధరించడమే తరువాతి దశ అని వివరించారు.

ఇదీ చదవండి..

ట్రంప్‌ని ఇరకాటంలోకి నెట్టిన ఫౌచి!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.