అమెరికాలో తుఫాను బీభత్సం
close

తాజా వార్తలు

Published : 14/04/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలో తుఫాను బీభత్సం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టించింది. ఒకేసారి అధిక సంఖ్యలో టోర్నడోలు విరుచుకుపడటంతో ఉత్తర లూసియానాలో 300లకు పైగా ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ మిస్సిసిపీ రాష్ట్ర్రంలో ఆరుగురు మృతి చెందారు. ప్రధాన నగరాలైన వాల్తాల్‌లో ఒకరు మరణించగా.. లారెన్స్‌లో ఇద్దరు, జెపరెన్స్‌ దేవ్స్‌లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. భారీ చెట్లు, ట్రక్కులు తుఫాను ధాటికి నేలకొరిగాయి. మండ్రో విమానాశ్రయంలో టోర్నడో కారణంగా భవనాలు కూలీ రన్‌వేపై శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. 30 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ తెలిపారు. అలబామా, పశ్చిమ జార్జియా రాష్ట్ర్రాలు, తూర్పు టెక్సాస్‌ నుంచి తూర్పు తీరం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాలకు తుఫాను ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని