close

తాజా వార్తలు

Updated : 22/11/2020 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఇది అహ్మదాబాద్‌ కాదు హైదరాబాద్‌

తెరాస అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తోంది. భాజపా విద్వేషాలు రెచ్చగొట్టే పంథాను అనుసరిస్తోంది.హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీకి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి, మంటల్లో చలికాచుకోవాలని ప్రయత్నించడం సమర్థనీయం కాదు. వారు చెప్పే మాయమాటలు నమ్మడానికి ఇది అహ్మదాబాద్‌ కాదు. హైదరాబాద్‌’ అని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వీసీల దస్త్రం వెనక్కి

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నరు కార్యాలయం వెనక్కి తిప్పి పంపింది. ఇటీవల శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాలను ప్రభుత్వం గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపింది. 20 రోజులపాటు పెండింగ్‌లో పెట్టిన ఆయన కార్యాలయం, న్యాయనిపుణుల సలహా అనంతరం వాటిని వెనక్కి పంపింది. ప్రభుత్వం నుంచి ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ దస్త్రాన్ని పంపినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇక కేంద్రమే తేల్చాలి

3. అంతరిక్షంలో... ఇరవయ్యేళ్లు!

దేనినైనా పట్టుకోకుండా నిలబడి నాలుగు అడుగులు వేయడం సాధ్యం కాదు. గాలిలో తేలుతూనే పనులన్నీ చేసుకోవాలి. పగలూ రాత్రీ అన్న పద్ధతి ఉండదు. కడుపు నిండా ఇష్టమైన తిండీ, కంటి నిండా నిద్రా... కష్టమే. అయినా అంతరిక్ష యాత్రికులను అవేవీ ఆపడం లేదు. కుటుంబాలను వదిలిపెట్టి ఉత్సాహంగా వెళ్తున్నారు, నెలల తరబడి ఉంటున్నారు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ పరిశోధనలు చేసి రేపటి గ్రహాంతరవాసానికీ, నేటి వైద్య చికిత్సలకీ చక్కని బాటలు వేస్తున్నారు. గత ఇరవయ్యేళ్లుగా భూమికీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ మధ్య జరుగుతున్న రాకపోకలూ అక్కడ ఉన్నవారు చేస్తున్న పరిశోధనలూ... మానవాళి ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొవిడ్‌కు సరికొత్త చికిత్స

కొవిడ్‌-19 బాధితుల్లో ప్రాణాంతక ఇన్‌ఫ్లమేషన్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడం, అవయవ వైఫల్యం వంటి వాటిని నివారించడానికి భారత అమెరికన్‌ శాస్త్రవేత్త, తెలుగు తేజం తిరుమల దేవి కన్నెగంటి సరికొత్త చికిత్స మార్గాన్ని కనుగొన్నారు. కరోనా సోకినవారిలో ‘ఇన్‌ఫ్లమేటరీ కణ మరణం’ అనే ప్రక్రియ సంభవిస్తున్న తీరును ఆమె గుర్తించారు. దాన్ని విచ్ఛిన్నం చేసే చికిత్సలను కనుగొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు

5. నూనెలు సలసల

వంటనూనెల ధరలు సలసల కాగుతున్నాయి. రికార్డు స్థాయిలో ప్రతీ వంటనూనె లీటరు రూ.100 దాటిపోయింది. గతంలో అన్ని నూనెల ధరలు రూ.100 దాటినా పేదలు ఎక్కువగా వాడే పామాయిల్‌ ధర తక్కువగానే ఉండేది. ఇప్పుడదీ అనూహ్యంగా పెరిగింది. లీటరు పామాయిల్‌ను రికార్డుస్థాయిలో రైతుబజార్లలోనే రూ.105కి అమ్ముతున్నట్లు ‘రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్‌ఫెడ్‌) తాజాగా ప్రకటించింది. ‘విజయ’ బ్రాండు పేరుతో ఈ సంస్థ వంటనూనెలను విక్రయిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అందమా... అందుమా!

నసు సౌందర్య అన్వేషి. బుద్ధి సౌందర్య ఉపాసి. దేహం సౌందర్య పిపాసి. ‘అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా...’ అనుకొంటూ అనుక్షణం మనసు సౌందర్యాన్వేషణలో మునిగి తేలుతుంది. దశదిశలా దర్శించిన మహా సౌందర్య విభూతిని ఉపాసిస్తుంది- బుద్ధి. అందాన్ని సొంతం చేసుకొని బాహ్య ఇంద్రియాల అనుభవంలోకి తెచ్చుకోవాలనే పిపాస (తీరని దాహం) దేహానిది. దృక్కోణాలు వేరైనా అందమంటే అందరికీ ఆసక్తేనన్నది దీని సారాంశం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫైజర్‌ టీకా... ఆమె ‘ప్రేమ’కానుక!

ప్రేమ... ఆ జంటను కలిపింది. ఆ జంట... ఓ ఆశయాన్ని ఏర్పరుచుకుంది. ఆ ఆశయం... ఇప్పుడు ప్రపంచానికి ఆశగా, ఆసరాగా మారింది. కరోనాపై యుద్ధం చేసే ఓ ఆయుధమైంది. దీనికంతటికీ చోదకశక్తిగా నిలిచింది ఆమె...సైన్స్‌, ప్రేమ  చెట్టపట్టాలేసుకుని కలిసి తిరిగితే ఎలా ఉంటుంది? డాక్టర్‌ ఓజ్లెమ్‌ టురేసి... డాక్టర్‌ ఉరుమ్‌ షాహిన్‌ల జంటలా ఉంటుంది. జర్మనీకి చెందిన ఈ డాక్టర్లు నిజానికి వలసపక్షులు. ఇస్తాంబుల్‌లో పుట్టిన ఓజ్లెమ్‌ తండ్రితో కలిసి జర్మనీకి వలస వచ్చింది. ఆయన డాక్టర్‌ కావడంతో... అతని దగ్గర ఎంతోమంది నన్స్‌ నిస్వార్థంగా వైద్య సేవలు అందించేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా భయంతోనే 80% మంది బడులకు దూరం

8. 18 నెలల్లో... రూ.1000 కోట్లు సంపాదించా!

అనగనగా ఓ కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్‌ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2200 కోట్ల రూపాయల విలువ కల్పించి... అనూహ్యంగా అమ్మేశాడు! 40 ఏళ్ల వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్‌-పారిశ్రామికవేత్త కరణ్‌ బజాజ్‌! చిత్రమైన అతని కెరీర్‌ ప్రయాణమే భారతీయ స్టార్టప్‌ రంగంలో ఈ ఏడాది హాట్‌ టాపిక్‌. ఆ ప్రస్థానం గురించి కరణ్‌ మాటల్లోనే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చిన్నచిన్న దొంగతనాలు చేస్తా!

మాళవిక శర్మ... ‘నేలటిక్కెట్టు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ అమ్మడు. తాజాగా యంగ్‌ హీరో రామ్‌ సరసన ‘రెడ్‌’ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసి త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా తన
గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతోందిలా... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పటికి సిద్ధంగా ఉంటా

ఐపీఎల్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ గాయంపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిట్‌గా లేడంటూ సెలక్టర్లు రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోగా.. అతడు మాత్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేశాడు. ఆ తర్వాత టెస్టు సిరీస్‌కు ఎంపికైనా రోహిత్‌ గాయంపై స్పష్టతైతే లేదు. అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో తన గాయంపై పెదవి విప్పిన రోహిత్‌.. ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశాడు. అతడు ఏమన్నాడంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.