close

తాజా వార్తలు

Updated : 02/12/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. అదే నిర్లిప్తత

ఓటుకు పోటెత్తడంలో హైదరాబాదీలు వెనుకబడ్డారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యే విషయంలో షరా మామూలు నిర్లిప్తతను ప్రదర్శించారు. ప్రస్తుత పోలింగ్‌ శాతం గ్రేటర్‌ గత ఎన్నికలకంటే కాస్త మెరుగనిపించినా అది నామమాత్రమే. సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహం చూపే జనం.. సమాజం మధ్యకు వచ్చి గురుతర బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో మిన్నకుండిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇదీ ఎక్స్‌అఫిషియో లెక్క...

2. కమిటీకి ససేమిరా..

రైతులు పట్టు వీడలేదు. కేంద్రం మెట్టు దిగలేదు. ఫలితంగా అన్నదాతలతో ప్రభుత్వం మంగళవారం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దుచేయాలని డిమాండుచేస్తూ దేశ రాజధాని చుట్టుపక్కల రహదారులపై బైఠాయించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని తెగేసి చెబుతుండడంతో.. పరిస్థితి అంతకంతకూ జటిలమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నివురుగప్పిన కరోనా

కొవిడ్‌ నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండో దశ విజృంభణపై మన దగ్గరా ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్‌ దేశాల్లో తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలో గతంలో కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ దిల్లీ, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. దిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లో రోజుకు 5 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
టీకా అందరికీ అవసరం లేదు

4. బోర్‌వెల్‌ వాహనం, కారు ఢీ: ఆరుగురి మృతి

వెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై బోరువెల్‌ వాహనం - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవు

 గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామంటూ ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నవంబరు 17న చేసిన ప్రకటనను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల సంఘం చర్యలను నిలిపివేయించాలని కోరారు. కరోనా తీవ్రత దృష్ట్యా పునరాలోచించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇంటిపై యుద్ధం

6. అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నట్లే కదా!

కరోనా వైరస్‌ బాధితుల నివాసాల వెలుపల పోస్టర్లను అంటించడమంటే వారిని అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారనే భావనే కలుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. వైరస్‌ బారిన పడకుండా ఇతరులను రక్షించటానికే ఆ విధంగా చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటున్నాయని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అఫ్గాన్‌లో ఆగని హింస!

ఫ్గానిస్థాన్‌ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. తాజాగా వేర్వేరు ఘటనల్లో 34మంది దాకా మరణించారు. శాంతి స్థాపన కోసం ఒకపక్క దోహాలో చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే, మరోపక్క హింస పెచ్చరిల్లడం ఇక్కడి వైచిత్రి. ప్రభుత్వ వర్గాలతో శాంతిచర్చలు సాగిస్తున్న తాలిబన్లు మరోవైపు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం జులై ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు హింసాత్మక దాడులు 50 శాతందాకా పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
8. వారి ఆలోచనే నన్ను బతికించింది!

ఎదుటివారికి మన గురించి చెప్పేటప్పుడు గతంలో చేదు జ్ఞాపకాలు ఉంటే వాటిని అలాగే మనసు పొరల్లో పాతరేసి తక్కిన విషయాల గురించి మాత్రమే చెబుతాం. కానీ అవని అలా చేయలేదు. తన కథని అలాగే చెప్పడానికి ఇష్టపడుతుంది..అంతేకాదు ఎంతోమంది బాలికలకు, యువతులకు ధైర్యం నూరిపోస్తుంది. తన జీవితాన్నే పాఠాలుగా మార్చి బోధిస్తోంది. సామాజిక సమస్యలను ఎదుర్కొనే సైనికులుగా మారుస్తోంది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ దర్శకులు మంచి కథకులు

ఒకప్పుడు రచయితలు కథను అందిస్తే వాటి ఆధారంగా దర్శకులు సినిమాను తెరకెక్కించేవారు. తర్వాత కాలంలో దర్శకులే కథలు, మాటలు రాస్తూ వచ్చారు. ఇప్పటికీ కథలు అందించే వారున్నా సొంతంగా రాసుకుంటున్న దర్శకులే ఎక్కువ. ఇప్పుడు తరం మారింది. కొందరు అగ్ర దర్శకులు పెద్ద హీరోలతో పనిచేస్తూనే వారు చెప్పాలనుకుని, భారీ స్థాయిలో చేయలేని కథలను చిన్న సినిమాలుగా అందిస్తున్నారు. కథలు తాము రాసి... వేరే యువ దర్శకులకు సినిమా తెరకెక్కించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అవసరమైతే స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో తీవ్రత చూపించలేకపోయామని, నేటి పోరులో సత్తాచాటుతామని టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఈ ఒక్కటైనా..


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని