close

తాజా వార్తలు

Published : 31/10/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు కమిటీలు

కొవిడ్‌-19 టీకా అందుబాటులోకి రాగానే దేశవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం (వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌) సజావుగా సాగేలా చూసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. ఈమేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో 3 రకాల కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ.. వాటి విధులను కూడా వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మళ్లీ విజృంభణ

2. రైతు ఐక్యతకు వేదిక

గ్రామస్థాయిలో అన్నదాతలంతా ఓ చోట చేరి కష్టనష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏర్పాటైన ఆధునిక మందిరాలే రైతు వేదికలు. రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంలో భాగంగా వారిని చైతన్య పరిచేందుకు ప్రతి ఐదువేల ఎకరాలకొకటి చొప్పున కూడలి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్మించింది. ప్రభుత్వ నిధులే కాకుండా ప్రజాప్రతినిధులూ ఈ బృహత్తర కార్యక్రమానికి విరాళాలను అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పోలవరంలో మరింత కోత?

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఇప్పటికే పెద్ద కొర్రీ పడిందని ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు మరింత కోత పెట్టే నిర్ణయం ఒకటి తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టులో తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి, విద్యుత్కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. ఆ మేరకు కోత పెట్టి 1.4.2014 నాటికి ఉన్న ధరల ప్రకారం అంచనాలు లెక్కించి ఆ మొత్తమే ఇస్తామని తేల్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి వ్యాఖ్యపై ముస్లింల నిరసన

మహమ్మద్‌ ప్రవక్తపై కార్టూన్లు వేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ చేసిన వ్యాఖ్యపై ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఊరేగింపు జరిపి, మేక్రాన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఫ్రాన్స్‌ వస్తువులను బహిష్కరించాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతాల్లో మసీదుల వద్ద ప్రదర్శనలు జరిగాయి.  పాకిస్థాన్‌లోని ఇస్లామామాద్‌లో జరిగిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టర్కీ భూకంపం: 24కు చేరిన మృతుల సంఖ్య

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 450 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్వల్ప గాయాలైన దాదాపు 364 మంది ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ఇజ్మిర్‌ ప్రావిన్స్‌లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భవిష్యత్తంతా.. టెక్‌దే!

భవిష్యత్తులో ఐటీ రంగంలో టెక్నాలజీ హవా కొనసాగనుంది. కరోనా కారణంగా ఈ రంగంలో కొంత స్తబ్దత నెలకొన్నా.. ఆర్థిక వ్యవస్థ మెరుగైన తరువాత 80 శాతం కొత్త ఉద్యోగాలు ఈ రంగంలోనే రానున్నాయి. దేశంలో ‘భవిష్యత్తు నైపుణ్యాల ప్రతిభ - డిమాండ్‌, సరఫరాలో వ్యత్యాసం’పై అధ్యయనం జరిపిన.. నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌) ఇటీవల ఆ నివేదికను విడుదల చేసింది. ఐటీ రంగంలో భవిష్యత్తులో గిరాకీ మేరకు మానవ వనరులను సిద్ధం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నైపుణ్య శిక్షణను ప్రారంభించాలని నాస్కామ్‌ సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. థాంక్స్‌.. కరోనా

రోనా ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. కానీ ఓ విషయంలో మాత్రం నా స్నేహితుడు ప్రవీణ్‌కి ఎంతో మేలు చేసింది. ఆ సంఘటనని మీతో పంచుకుంటున్నా. ప్రవీణ్‌ కేరింతలు కొడుతున్నాడు. విజయ గర్వంతో పిడికిళ్లు గాల్లోకి విసిరాడు. అసలేం జరిగిందంటే.. ఆరోజు కాలేజీ కల్చరల్‌ ఫెస్ట్‌. చివరగా డాన్స్‌ పోటీల విజేతని ప్రకటించారు. ‘అండ్‌ ద విన్నర్‌ ఈజ్‌ ప్రవీణ్‌’ అని పిలవగానే తన కళ్లలో ఆనందభాష్పాలు. ఈ రోజు కోసం ఎంతో కష్టపడ్డాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ‘డాన్స్‌ తిండి పెడుతుందా?’ అని ఎందరితోనో చీవాట్లు తిన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూపాయి తీసుకోకుండా శిక్షణ ఇస్తాం!

ఆత్మవిశ్వాసం స్త్రీలకు ఆభరణం... అది తోడవ్వాలంటే వారికి ఆర్థిక సాధికారత ఎంతో అవసరం.  ఆ విషయాన్ని మాటల్లో చెప్పడంకంటే... చేతల్లో చూపించాలనుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ధేరం ఉష. అందుకోసం బస్తీల్లోని ఆడపిల్లలూ, మహిళలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆపైన వ్యాపార మెలకువలు నేర్పించి స్వయం ఉపాధి పొందేలా చేయూతనందిస్తున్నారు. ఆ ప్రయత్నం గురించి ఆమె ఏం చెబుతారంటే...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘చందమామ’ పెళ్లి ‘తార’లు వెళ్లి

ప్రముఖ కథానాయిక, టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ వివాహం శుక్రవారం ముంబైలో ఘనంగా జరిగింది. పరిమిత సంఖ్యలో హాజరైన బంధు మిత్రుల సమక్షంలో యువ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడిచారు కాజల్‌. ఆమె ఇంటికి సమీపంలోని ఓ స్టార్‌ హోటల్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. కొందరు హాజరై ఆశీర్వదించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్లేఆఫ్‌కు దారేది?

ఐపీఎల్‌-13 లీగ్‌ దశలో ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ముంబయి మాత్రమే ప్లేఆఫ్‌ చేరుకుంది. చెన్నై రేసు నుంచి నిష్క్రమించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. మరి ఈ జట్ల ప్లేఆఫ్‌ అవకాశాలెలా ఉన్నాయో చూద్దాం పదండి. ఓ దశలో.. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో బెంగళూరు, 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో దిల్లీ క్యాపిటల్స్‌ చెరో 14 పాయింట్లతో తేలికగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టేలా కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బాదేశారు మళ్లీ..


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.