close

తాజా వార్తలు

Published : 29/10/2020 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఒక్క క్లిక్‌తో ఆస్తులు సమస్తం

రాష్ట్రంలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో వ్యవసాయ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో లభ్యంకానుంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డుల నమోదు.. నిర్వహణలో సరికొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం ధరణి పోర్టల్‌ను అధికారికంగా గురువారం అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వడ్డీపై వడ్డీ మాఫీ ఊరట ఎంత?

 కొవిడ్‌ సంక్షోభం వల్ల ఆదాయాలు కోల్పోయిన వారికి కల్పించిన రుణ వాయిదాల (ఈఎంఐలు) మారటోరియం ఎలా అమలు జరుగుతుందనే విషయమై ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఉన్న రుణ బకాయిలను లెక్కలోకి తీసుకోబోతున్నట్లు బుధవారం స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం అమలైంది. మారటోరియం వినియోగించుకున్న వారికి, రుణ బకాయిలకు సంబంధించి వడ్డీపై వడ్డీ(చక్ర వడ్డీ) పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పెళ్లి చేసుకుంటే దేవుడికి కట్నం!

 ప్రజలు వివిధ రకాల పన్నులు చెల్లించే విధానాలు రాజుల కాలం నుంచీ ఉన్నాయి. పెళ్లిళ్లు చేసుకుంటే ఆడపెళ్లివారు ఇంత, మగ పెళ్లివారు ఇంత అంటూ దేవుడికి కట్నాలు చెల్లించే పద్ధతి కూడా ఒకటి ఉందని తెలుసా? మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో తాజాగా వెలుగుచూసిన రాతి శాసనం, దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనంలో దేవుడి ఉత్సవాలకు, కల్యాణానికి కట్నాలు చెల్లించేవారని బహిర్గతమైందని తెలంగాణ జాగృతి చరిత్ర బృందం ప్రతినిధి, పురాతత్వ పరిశోధకుడు రామోజు హరగోపాల్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చక్రబంధంలో చైనా

బలగర్వంతో భారత్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న చైనా తానే చక్రబంధంలో ఇరుక్కుపోనున్నది. లద్దాఖ్‌ నుంచి తైవాన్‌ వరకు ప్రతి చోటా కయ్యానికి కాలుదువ్వుతున్న ‘బీజింగ్‌’ ఆట కట్టించడానికి భారత్‌తో అమెరికా చేతులు కలిపింది. ‘క్వాడ్‌’లో సాటి సభ్యులైన జపాన్‌, ఆస్ట్రేలియాలతో పాటు ఇతర ఆసియా దేశాలనూ కలుపుకొని పోదలచింది. అందుకే అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత్‌తో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేసియాలలోనూ పర్యటిస్తున్నారు. ఇంతకాలం శ్వేతపత్రాలకు, చర్చలకు, అడపాదడపా సైనిక కవాతులకు పరిమితమైన క్వాడ్‌ కూటమి ఇక బీజింగ్‌పై కత్తి ఝుళిపించక తప్పదని గ్రహిస్తోంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్థానికంపై సమరం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ రాజకీయాలను వేడెక్కించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై వాడివేడి విమర్శలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 11 పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు. పాత నోటిఫికేషన్‌ను, ఏకగ్రీవాలనూ పూర్తిగా రద్దుచేసి మళ్లీ మొదట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 9 పార్టీలు కోరగా, రెండు మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, టీకా వచ్చిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని అన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌ఈసీ వ్యవస్థలా వ్యవహరించాలి

6. బతుకు బాటకు భజగోవిందం

నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? మయసభలో దుర్యోధనుడిలా ఉంది నీ పరిస్థితి... లేనిది ఉన్నట్టు భ్రమపడుతున్నావ్‌... శాశ్వతమైన సత్యాన్ని చూడలేకపోతున్నావ్‌... విలువైన వజ్రాలను వదిలేసి, కొరగాని రంగురాళ్ల కోసం పాకులాడుతున్నావ్‌... నీ ఆయుర్దాయాన్ని అగ్నిలో ఆజ్యంలా అర్పించేస్తున్నావ్‌.. ఓ విషయం గుర్తుంచుకో... సంప్రాప్తే సన్నిహితే కాలే... కాలం తోసుకొచ్చేస్తుంది. జీవితం సంవత్సరాలుగా, రోజులుగా, ఘడియలు, గంటలుగా మారిపోతోంది... విషయ వాంఛల్లో మునిగితేలుతున్న ఓ మూఢమతీ... లే... నిజం తెలుసుకో... ఇజం మార్చుకో... భగవంతుడు చూపిన మేలుబాటలో పయనించు... ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జ్వెరెవ్‌ వల్లనే గర్భవతినయ్యా

23 ఏళ్ల వయసులోనే జర్మనీ టెన్నిస్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తండ్రి కాబోతున్నాడా?.. అతని మాజీ ప్రేయసి బ్రెండా వ్యాఖ్యల ప్రకారం అది నిజమేనని తెలుస్తోంది. తాను గర్భంతో ఉన్నానని, దానికి కారణం జ్వెరెవ్‌ అని.. ఈ ఏడాది ఆగస్టులో అతని నుంచి విడిపోయిన 27 ఏళ్ల బ్రెండా వెల్లడించింది. ఈ జోడీ ఓ ఏడాది పాటు సహజీవనం చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో బ్రెండా మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘జంగిల్‌రాజ్‌’కు ఆయన యువరాజు

‘జంగిల్‌ రాజ్‌’కు యువరాజు.. అంటూ రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మలివిడతగా దర్భంగా, ముజఫర్‌నగర్‌, పట్నాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధాని బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీపై అనేక విమర్శలు చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అక్టోబర్‌ 30న అన్నీ చెబుతా: పునర్నవి

నటి పునర్నవి భూపాలం తాజాగా తన అభిమానుల్ని షాక్‌కు గురి చేశారు. బుధవారం రాత్రి ఆమె పెట్టిన ఓ పోస్ట్‌తో నెటిజన్లు గందరగోళానికి గురి అవుతున్నారు. విభిన్నమైన నటన, చలాకీతనంతో పునర్నవి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తన బ్యూటీ, ఫిట్‌నెస్‌, స్టైల్‌కు సంబంధించిన పోస్టులతో తరచూ ఇన్‌స్టా వేదికగా ఆమె ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె.. తన చేతికి ఉన్న రింగ్‌ ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పంత్‌.. ఇక నిద్ర చాలు! 

పది నిమిషాల్లో మ్యాచును మలుపుతిప్పే సామర్థ్యం.. ఆడిన రెండో బంతికే సిక్సర్‌ బాదేసే తెగువ.. ఎదుట ఉన్నది ప్రపంచంలోనే అత్యుత్తమ పేసరైనా భయపడని తత్వం.. ఒకే టోర్నీలో అత్యధిక క్యాచులు పట్టిన ఘనత.. ఆసీస్‌, ఇంగ్లాండ్‌ గడ్డపై సెంచరీలు కొట్టిన భారత ఏకైక వికెట్‌కీపర్‌.. అంతకుమించి ధోనీకి సరైన వారసుడన్న పేరు. కానీ.. ఇప్పుడదే మహీని అనుకరిస్తున్నానన్న భ్రమలో తన సొంత అస్థిత్వానికే ముప్పు తెచ్చుకున్నాడు. ఆసీస్‌తో వన్డే, టీ20 జట్లలో చోటు కోల్పోయి తన సహచరులతోనే పోటీపడుతున్న రిషభ్‌ పంత్‌కు ఇది ‘వేకప్‌ కాల్‌’. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తొలి అడుగు ముంబయిదే!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.