close

తాజా వార్తలు

Published : 23/09/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. మరిన్ని బలగాల తరలింపు వద్దు

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భారత్‌, చైనాలు ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించరాదని తీర్మానించాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఏకపక్షంగా మార్చకూడదని కూడా నిర్ణయించినట్లు తెలిపాయి. పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే చర్యలకు దూరంగా ఉండాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వివరించాయి.  సోమవారం చుషుల్‌ సెక్టార్‌లోని మాల్దో ప్రాంతంలో రెండు దేశాల సీనియర్‌ సైనిక కమాండర్ల భేటీ జరిగిన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఒక ఉమ్మడి ప్రకటనను భారత్‌, చైనాలు విడుదల చేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘డోక్లామ్‌’ తర్వాత చైనా స్థావరాలు రెట్టింపు!

2. బడికెళ్లకుండానే పది పరీక్షలు!

పాఠశాలలో చేరకపోయినా రుసుం చెల్లించి పదో తరగతి వార్షిక పరీక్షలు రాయొచ్చు. ఇలాంటి వెసులుబాటును ఈ విద్యా సంవత్సరానికి(2020-21) ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయాలంటే విధిగా ఏదో ఒక పాఠశాలలో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఆ పాఠశాల ద్వారానే విద్యార్థుల వివరాలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి(ఎస్‌ఎస్‌సీ బోర్డు) సమర్పించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొత్తిమీర కూడా దొరకదు

‘‘కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త వ్యవసాయ చట్టం వల్ల ఆ రంగం ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆఖరుకు కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లి వంటివి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బిల్లుల దుష్పరిణామాలు దీర్ఘకాలంలో బాగా కనిపిస్తాయి. ఇప్పటికే ఇతర రంగాలన్నిటినీ ప్రైవేటు పరం చేసి ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు సంస్థలకే ఇవ్వడానికి ఈ చట్టం తెస్తున్నారు. రైతులు పండించిన పంటలను ప్రైవేటు సంస్థలే కొనాలని, ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవాలన్నదే దీని ఉద్దేశం’’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

4. ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100 శాతం ఆన్‌లైన్‌లో చేర్చాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. కొలిక్కిరాని టాలీవుడ్‌ మత్తుమందుల కేసు

టాలీవుడ్‌ మత్తుమందుల కేసు మూడేళ్లయినా జీడిపాకంలా సాగుతూనే ఉంది తప్ప కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. ఈ కేసు పురోగతిపై సుపరిపాలన వేదిక.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ఈ నెల 1న ఆబ్కారీ శాఖ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకూ 8 కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశామని.. మిగతా వాటిలో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉందని తెలిపింది చాలా మంది సినీతారలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై వారందర్నీ పిలిచి విచారించిన కేసులో మూడేళ్లయినా దర్యాప్తు కొలిక్కి రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు

6. తూటాలకు ఎదురొడ్డిన చైతన్యం

మహిళలను- తమతో సమానంగా చూడటానికే ఇష్టపడని పురుష పుంగవులున్న దేశం అఫ్గానిస్థాన్‌. ఆ గడ్డ మీద... సాధారణ మహిళలు తమ పుట్టుకే ఒక శాపమని కుంగిపోతుంటారు. స్త్రీ సాధికారత గురించి మాట్లాడితే- ఎన్నో నిరసన గళాలు బుసకొడతాయి. హక్కుల పేరిట చైతన్య పథంలో పయనించే అతివలపై దాడులు తప్పవు. అలాంటి దేశంలో పుట్టి, ప్రజల ఆలోచనా ధోరణి మారాలని గొంతెత్తిన సాహస వనిత ఫాజియా కూఫీ. ఆమె అఫ్గానిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీ సభ్యురాలు, ఉద్యమకారిణి, రచయిత్రి. బదక్షాన్‌ ప్రావిన్సు మహిళ. ఆమె మీద అనేక హత్యా యత్నాలు జరిగాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. వాహన ఆవిష్కరణలకు పండుగ కళ

దసరా-దీపావళి పండుగల సీజన్‌ సమీపిస్తుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణపై దృష్టి పెట్టాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నుంచి తేరుకుని, ఉద్యోగ-వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నందున, పండుగల సమయంలో విక్రయాలు పుంజుకుంటాయనే అంచనాతో వాహన కంపెనీలున్నాయి.ఇటలీ సూపర్‌బైకుల సంస్థ డుకాటీ కొత్త స్క్రాంబ్లర్‌ 1100 ప్రో, 1100 స్పోర్ట్‌ ప్రో బైకులను భారత విపణిలోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.11.95 లక్షలు, రూ.13.74 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. ఈ బైకులు 1100 సీసీ ఇంజిన్‌, 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌లతో వస్తున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. ఆట మనది.. వేట వారిది!

‘‘రంగులు చెప్పండి.. రూ.లక్షల్లో బహుమతులు పొందండి’’ అంటూ ప్రచారంతో యువతీ యువకులు, విద్యార్థులను ఆకర్షించి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల అసలు వ్యూహం వేరే ఉందని సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. డోకీపే, లింక్‌యున్‌ సహా 30 చైనా సంస్థల గుప్పిట్లో ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడిన 25 లక్షల మంది ఫొటోలు, ఈ-మెయిల్‌ చిరునామాలు ఉన్నాయని.. వారి వ్యక్తిగత వివరాల సేకరించి, ఫోన్లు, మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వారి కార్యకలాపాలపై కన్నేశారని అంచనా వేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. నడవలేని అమ్మాయి...ఎందరినో నడిపిస్తోంది!

అందమైన పాపాయి పుట్టిందని ఎంతో సంబరపడ్డారా తల్లిదండ్రులు. కానీ పాప మొదటి పుట్టినరోజైనా చేయకముందే వారి ముఖంలో నవ్వులు మాయమయ్యాయి...శరీరంలో ఒక్కో అవయవం పనిచేయడం మానేసింది. అస్సలు కదల్లేని పరిస్థితి. వైద్యానికి లొంగని ఆ సమస్యని ‘కన్‌జనిటల్‌ మస్క్యులర్‌ డిస్ట్రోఫీ’గా నిర్ధారించారు. పేరేదైనా మైత్రీ జీవితంలో అదో పెనుతుఫానే. ఆ తుఫాను నుంచి తన జీవితాన్ని గట్టెక్కించే ప్రయత్నం గట్టిగానే చేసింది మైత్రి. అంతేకాదు, తనలా వైకల్యం ఉన్నవారికి కూడా ఓ చక్కని మార్గం చూపిస్తోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. రాయల్స్‌ ధమాకా

భీకరమైన ముంబయి జట్టునే తొలి మ్యాచ్‌లో ఓడించింది చెన్నై సూపర్‌కింగ్స్‌. ఇటు చూస్తే రాజస్థాన్‌ స్టోక్స్‌, బట్లర్‌ లాంటి మేటి ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగింది. మ్యాచ్‌లో చెన్నై గెలుపు నల్లేరుపై నడకే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ మ్యాచ్‌ మొదలైన కాసేపటికే ఆ అంచనాలు తలకిందులవ్వడం మొదలయ్యాయి. సింగిల్స్‌ తీసినంత సులువుగా సిక్సర్లు బాదిన సంజు శాంసన్‌.. తనదైన శైలిలో దూకుడు చూపించిన స్మిత్‌.. చివర్లో వచ్చి విధ్వంసం సృష్టించిన ఆర్చర్‌ కలిసి రాయల్స్‌కు కొండంత స్కోరునందించారు. ఆపై డుప్లెసిస్‌ ఎంతగా పోరాడినా.. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా కొంత ప్రయత్నించినా.. ఆ స్కోరునందుకోవడం సాధ్యం కాలేదు. టోర్నీలో అతి తక్కువ అంచనాలతో బరిలోకి దిగిన రాయల్స్‌.. అదిరే విజయంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​
 * మహీ: వ్యూహం కాదు.. సన్నద్ధత లేకే


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.