close

తాజా వార్తలు

Published : 02/12/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఇమ్రాన్‌ నోటి దురుసు.. అమెరికా ఆంక్షలు..!

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..! ఈ సామెత ఇమ్రాన్‌ఖాన్‌కు ఇంకా తెలిసినట్లు లేదు. ఆయన టర్కీ ఖలీఫా రాజ్యస్థాపనలో తలమునకలై.. మిత్రులను కూడా దూరం చేసుకొంటున్నారు. ఫలితం ఆ దేశ సైన్యానికి ఆయుధాల (మెయింటెనెన్స్‌) నిర్వహణ కష్టంగా మారి మూలనపడే పరిస్థితి నెలకొంది. ఇక  చైనా అన్నయ్య సాయం చేస్తాడనుకుంటే.. అమెరికా ఆంక్షలు కట్టిపడేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొలిక్కిరాని చర్చలు.. సరిహద్దుల్లోనే రైతన్నలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. అన్నదాతలు లేవనెత్తిన అంశాలపై చర్చిండానికి కమిటీని నియమిస్తామన్న కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు మూకుమ్మడిగా తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో చర్చలు గురువారానికి వాయిదా పడటంతో హస్తిన సరిహద్దుల్లో రైతన్నల ఆందోళన ఏడో రోజు కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇసుక కొరత, నూతన విధానంపై తెదేపా నిరసన

ఇసుక దోపిడీకి అడ్డుపడుతుందనే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని వైకాపా ప్రభుత్వం అమలు చేయట్లేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన ప్రదర్శన చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రైతులకు న్యాయం జరిగేలా చూస్తా: పవన్‌

4. ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడింది: భాజపా

పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భాజపా ఆరోపించింది. ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఈసీతో సమావేశం అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ పాతబస్తీలో మజ్లీస్‌పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని మేం చెప్పాం. సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా పోలింగ్‌ పెరిగింది’’ అని రామచంద్రరావు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ముందుకు రాని ఓటర్లు.. నెట్టింట సెటైర్లు 

యావత్‌ దేశాన్ని ఆకర్షించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం మళ్లీ అదే నిర్లప్తత ప్రదర్శించారు. దిల్లీ నుంచి గల్లీ నాయకులతో ఎన్నికల ప్రచారం ఆద్యంతం జోరుగా సాగినా.. పోలింగ్‌ రోజు ఓటర్లు ముందుకు రాకపోవడంతో చాలా కేంద్రాలు వెలవెలబోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహం చూపే జనం.. సమాజం మధ్యకు వచ్చి ఓటు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయంలో మాత్రం మిన్నకుండిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 94 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా 50 వేల దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నప్పటికీ, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..మంగళవారం 36,604 కొత్త కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోల్చుకుంటే 17.6శాతం పెరుగుదల కనిపించింది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94,99,413మంది వైరస్ బారినపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 565 కరోనా కేసులు

7. హెచ్‌ 1బీ వీసాలపై ఊరట

 అగ్రరాజ్యంలో వలసలు, నిరుద్యోగాన్ని అదుపులో పెట్టేందుకు డొనాల్డ్‌  ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాలకు కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన హెచ్‌ 1బీ వీసాలపై అధ్యక్షుడు విధించిన ఆంక్షలను ఇక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం తగినంత సమయం కేటాయించలేదని.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆశాకిరణంలా కబాసురా కుడినీర్‌ ఔషధం

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వ్యాధి చికిత్సలో సిద్ధ వైద్యం ఆశాకిరణంలా కనిపిస్తోంది. కొవిడ్‌పై పోరాటంలో రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు జర్మనీకి చెందిన ప్రాంక్‌ఫర్డ్‌ సంస్థ పరిశోధనలో తేలింది. ఆయుర్వేదం, సిద్ధ వైద్యం కలయికలో రూపొందించిన కబాసుర కుడినీర్‌ ఔషధం కొవిడ్‌-19పై పోరులో సత్పలితాలు ఇస్తున్నట్లు శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంతమందిని నవ్వించినందుకా మాకీ శిక్ష

తెలుగు సినిమా చరిత్రలో వారిద్దరిదీ చెరిగిపోని సువర్ణాధ్యాయం. ఒకరు తన వైవిధ్య నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోసే విలక్షణ నటుడు. మరొకరు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే హాస్య నటుడు. వారివురి కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వారే కోట శ్రీనివాసరావు-బాబు మోహన్‌. వారి నట జీవితం గురించి, వారిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది, వారు ఎదుర్కొన్న సవాళ్లు, బాధలు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వారి కామెడీ టైమింగ్‌తో ఎంతో చలాకీగా ‘ఆలీతో సరదాగా’లో సందడి చేశారు. అవన్నీ వారి మాటల్లోనే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యాహూ: ఫస్ట్‌లో సుశాంత్‌.. టెన్త్‌లో బన్నీ..!

10. ఆఖర్లో హార్దిక్, జడేజా విధ్వంసం‌

ఆఖర్లో హార్దిక్‌ పాండ్య (92; 76 బంతుల్లో, 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియాకు భారత్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో, 5×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. కోహ్లీసేనకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్‌లో లైఫ్ లభించిన ధావన్‌ (16; 27 బంతుల్లో, 2×4) అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* విరాట్‌ కోహ్లీ నయా రికార్డు


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని