close

తాజా వార్తలు

Published : 01/12/2020 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. గ్రేటర్‌లో‌..పలుచోట్ల ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ పలు చోట్ల ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రం 58 వద్ద, బంజారాహిల్స్‌ ఎన్జీనగర్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌: లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

2. ‘ముంబయిలో దాడి చేశాం..మాకు పురస్కారం ఇవ్వండి’

భారత్‌లో దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నందుకు తనకు అత్యున్నత పురస్కారం కావాలని పాక్‌ ప్రభుత్వాన్ని కోరాడట తహవుర్‌ రానా. అలాగే ఆ మారణహోమంలో పాల్గొన్న తొమ్మిది మంది ముష్కరులకు ఏకంగా పాక్‌ అత్యున్నత సైనిక పురస్కారాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడట. ఈ విషయాల్ని అమెరికా ప్రభుత్వం అక్కడి కోర్టుకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ దర్యాప్తును రాజకీయం చేయొద్దు : WHO

 ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ మూలాలను కనుగొనేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ సమాచారం ఎంతో అవసరమని ఉద్ఘాటించింది. కొవిడ్‌-19 మూలల కోసం జరుగుతున్న పరిశోధనను రాజకీయం చేయొద్దని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా అంటే కిమ్‌కు ఎందుకంత భయం?

కరడుగట్టిన నియంత. దేశంలో ఏ ఒక్క పౌరుడు ఆయన మాట జవదాటకూడదు. పేదరికంలో మగ్గుతున్నా.. ఆకలితో అలమటిస్తున్నా దేశంలోనే ఉండాలి. ఆయన విధించే కఠిన నియమాలకు కట్టుబడాలి. ఇప్పటికే ఆయనెవరో అర్థమై ఉంటుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఇప్పుడు ఆయనకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్‌. ఎక్కడ ఈ మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తుందోనని కిమ్‌ వణికిపోతున్నట్లు అనధికారిక సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అవును.. కిమ్‌ టీకా వేయించుకున్నారు..!

5. ఓల్డ్‌ మలక్‌పేటలో ఎల్లుండి రీ పోలింగ్‌

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్‌ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్‌ మలక్‌పేటలోని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌‌ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

6. రైతులతో చర్చలు జరపనున్న రాజ్‌నాథ్‌?

దిల్లీలో ఆందోళనకు దిగిన రైతులు ఇంకా తమ పట్టువీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. నేడు చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రైతు సంఘాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం వారితో చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అహంకారాన్ని వీడి.. రైతుల రుణం తీర్చుకోండి 

7. 4.60 శాతానికి తగ్గిన క్రియాశీల కేసులు..

దేశంలో కొన్ని రోజులుగా 40 వేలకుపైగానే నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. నిన్న 38 వేలుగా నమోదైన కేసుల సంఖ్య ఈ రోజు 31 వేలకు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,69,322 పరీక్షలు నిర్వహించగా 31,118 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,62,810కి చేరింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సుమ ప్రశ్నకు మహేశ్‌ సరదా సమాధానం

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌ దొరికినంత దోచుకో’లో తాజాగా మహేశ్‌, వైవా హర్ష, జోష్‌ రవి, సుదర్శన్‌ పాల్గొని సందడి చేశారు. షోలో భాగంగా హర్ష, మహేశ్‌, సుమ వేసిన పంచులు ఆకట్టుకున్నాయి. ‘కొబ్బరితోటలో కలెక్షన్‌కింగ్‌’ అనే రౌండ్‌లో సుమ-హర్షల మధ్య జరిగిన సంభాషణలు నవ్వులు పూయించాయి. కొబ్బరితోట గురించి గోదావరి మాండలికంలో సుమ మాట్లాడిన విధానం ఆకట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్యూటీలు మేకప్‌ను వదిలేశారోచ్‌..!

హీరోయిన్‌.. ముఖానికి రంగులు అద్దుకుని, గ్లామర్‌గా హీరో పక్కన మెరిసే అందాల భామ. గ్యాప్‌ దొరికితే చాలు.. ‘ట..చ..ప్‌..’ అంటూ మేకప్‌మెన్‌ను పిలుస్తుంటారు. ఇది ఒకప్పటి ఫార్ములా.. ఇప్పుడు నటీమణుల ధోరణి మారింది. కంటెంట్‌ నచ్చితే డీ-గ్లామర్‌ పాత్రలకూ సై అంటున్నారు. సమంత, నయనతార, ఐశ్వర్య రాజేష్‌, తాప్సీ తదితరులు మేకప్‌ లేకుండానూ ప్రేక్షకులతో క్లాప్స్‌ కొట్టించారు. కీర్తి సురేశ్‌, రష్మిక, ప్రియమణి తదితరు ఇలాంటి పాత్రలతో ఫిదా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా డీ-గ్లామర్‌ లుక్‌లోనూ వహ్‌వా అనిపించిన బ్యూటీలవైపు ఓలుక్‌ వేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సచిన్‌ సైక్లింగ్‌.. మారడోనా ఆట.. కైఫ్‌ బర్త్‌డే!

సచిన్‌ తెందూల్కర్‌ సైక్లింగ్‌, మారడోనా ఆట, కైఫ్‌ బర్త్‌డే ఏంటా అని ఆశ్చర్యపోకండి. ఇవన్నీ మాజీ క్రికెటర్లు సచిన్‌, గంగూలీ, సురేశ్‌ రైనా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో పంచుకున్న విశేషాలు. లిటిల్‌ మాస్టర్‌ వీకెండ్‌ను ఎంజాయ్‌ చేస్తూ సరదాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో సైక్లింగ్‌ చేసిన వీడియోను పోస్టు చేయగా, గంగూలీ ఇటీవల కన్నుమూసిన ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా ఆటను అభిమానులతో పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని