close

తాజా వార్తలు

Published : 27/09/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను  చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నరేంద్రమోదీకి WHO చీఫ్‌ ప్రశంస!

కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరులో భాగంగా వివిధ దేశాలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఇందులోభాగంగా టీకా సరఫరాపై అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్‌ఓ కొనియాడింది. ‘కరోనా పోరులోభాగంగా మీ నిబద్ధతకు ధన్యవాదాలు. ప్రపంచ శ్రేయస్సుకోసం మన దగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారికి ముగింపు పలకగలం’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 60లక్షలకు చేరువలో కరోనా కేసులు!

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతుతోంది. నిత్యం 85వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే 9,87,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 88,600 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 59లక్షల 92వేలకు చేరింది. ఇప్పటివరకు 49లక్షల మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో నిన్న ఒక్కరోజే 92వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రోజువారీ పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే విషయం పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,967 కరోనా కేసులు

4. కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, రిటైర్డ్‌ మేజర్‌ జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూన్‌ 25న దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం తీవ్ర గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకలేదని వైద్యులు నిర్ధరించారు. 1938 జనవరి 3న రాజస్థాన్‌లోని జసోల్‌లో జన్మించిన ఆయన సైన్యంలో వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. పదవీ విరమణ అనంతరం భాజపాలో చేరి 1980 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వ్యాన్‌లో మంటలు..13 మంది సజీవదహనం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను బోల్తా కొట్టడంతో భారీ ఎత్తున మంటలంటుకున్నాయి. దీంతో అందులో ఉన్న 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి, డ్రైవర్‌ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో వ్యానులో 20 మంది ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి కరాచీ వస్తున్న సమయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విచారణలో దీపిక కన్నీరు..!

మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌తోపాటు దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ శనివారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఐదుగంటలపాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీరు పెట్టుకున్నారట. అయితే ఇలా ప్రతీదానికి కన్నీరుపెట్టుకోవడంతో.. అధికారులు అసహనానికి గురయ్యారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఎమోషనల్‌ డ్రామాని కట్టిపెట్టి సమాధానం చెప్పమని అధికారులు ఆమెతో అన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సుశాంత్‌ కేసు: అది ప్రమాదకరమైన ధోరణి

7. మనం ఉంది ఇండియాలో కాదు: వార్నర్‌

ఈ సీజన్‌లో బోణీ కొట్టాలన్న హైదరాబాద్‌ జట్టు కోరిక రెండో మ్యాచ్‌లోనూ నేరవేరలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన వార్నర్‌ సేన శనివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. మిడిల్‌ ఆర్డర్‌లో ఒక్క మనీశ్‌పాండే తప్పితే బౌండరీలు బాదగలిగే బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం జట్టును తీవ్రంగా వేధిస్తోంది. విలియమ్సన్‌ గాయంతో జట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. దీంతో భారమంతా ఓపెనింగ్‌ జోడీ వార్నర్‌, బెయిర్‌స్టో మీదే వేసుకోవాల్సి వస్తుంది. వాళ్లిద్దరూ విఫలమైతే జట్టు విజయావకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈ వారం ఐపీవోకు యూటీఐ ఏఎంసీ..!

దేశంలోనే రెండో అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ యూటీఐ ఈవారం ఐపీవోకు రానుంది. సెప్టెంబర్‌ 29న ఈ కంపెనీ బిడ్లను స్వీకరించనుంది. రూ.10 ముఖవిలువ కలిగిన 3.8 కోట్ల వాటాలను ఈ ఐపీవోలో విక్రయించనుంది. దీనిలో షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ రూ.552 - రూ.554 మధ్య ఉంటుందని అంచనా. ప్రజలు యూటీఐ ఐపీవో మీద చాలా ఆసక్తితో ఉన్నారు. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం అత్యధిక లాభాలను పంచుతుందోని లెక్కలు చెబుతున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 12.8 శాతం లాభంతో, నిప్పన్‌ ఏఎంసీ 9శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రియుడి బర్త్‌డే.. లక్షల్లో నయన్‌ ఖర్చు..!

తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ పుట్టినరోజును ప్రతీ ఏడాది విదేశాల్లో నిర్వహిస్తుంటారు నటి నయనతార. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది నయన్‌.. విఘ్నేశ్‌ పుట్టినరోజును గోవాలో వేడుకగా జరిపించారు. వీరిద్దరూ కొన్నిరోజులపాటు గోవాలో సరదాగా గడిపారు. టూర్‌కి సంబంధించిన ఫొటోలను విఘ్నేశ్‌ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. టూర్‌ పూర్తి చేసుకుని ఇటీవలే వీరిద్దరూ ఓ ప్రైవేట్‌ చార్టర్‌లో చెన్నైకి తిరిగివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కమిన్స్‌ను చూసి నేర్చుకోవాలి: యువీ

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌, కోల్‌కతా ఆటగాడు కమిన్స్‌ తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అభిమానులంతా కమిన్స్‌ను విమర్శించారు. అయితే శనివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ కట్టుదిట్టంగా బంతులు వేశాడు. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి వికెట్‌ తీశాడు. కీలక సమయంలో హైదరాబాద్‌ ఓపెనర్‌ బెయిర్‌స్టోను అవుట్‌ చేశాడు. కమిన్స్‌ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. కమిన్స్‌ను చూసి యువబౌలర్లు ఎంతో నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.