close

తాజా వార్తలు

Published : 25/09/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. అమెరికా..ఇక చాలు!: చైనా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణపై అమెరికా చేస్తోన్న విమర్శలను చైనా మరోసారి తిప్పికొట్టింది. ‘అయిందేదో అయింది. అగ్రదేశం ఆ పేరుకు తగ్గట్టు ప్రవర్తించాలి’ అంటూ ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఉన్నతస్థాయి సమావేశంలో చైనా రాయబారి జాంగ్ జున్ మండిపడ్డారు. ఇటీవల ఐరాస స్వరప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా చర్యలే కారణమంటూ విరుచుకుడిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆస్పత్రి వద్దకు ఎస్పీబీ అభిమానులు

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీబీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యానికి సంబంధించి ఆస్పత్రి నుంచి తాజాగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇప్పటికే పలువురు అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైరస్‌ వ్యాప్తి తగ్గింది..! 

కరోనా.. అత్యంత వేగంగా వ్యాపించే వ్యాధి.. దీనిని కట్టడి చేయాలంటే వ్యాప్తిని అడ్డుకోవాల్సిందే. ఒక కరోనా రోగి సగటున ఎంతమందికి ఈ వ్యాధిని వ్యాప్తిచేస్తాడనే విషయాన్ని తెలిపే కొలమానాన్ని ‘ఆర్‌’ విలువ అంటారు. ‘ఆర్‌నాట్‌’ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రతివారం లెక్కిస్తారు. దీని విలువ ఎంత ఎక్కువ వస్తే వ్యాధి అంత ఎక్కువ మందికి వ్యాపిస్తోందని అర్థం. ప్రభుత్వాలు లాక్‌డౌన్లు విధించినా.. భౌతిక దూరం నిబంధనలు అమలు చేసినా... ఈ ఆర్‌ విలువను అదపు చేయడానికే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఒక్కరోజే 15లక్షల కొవిడ్‌ టెస్టులు!

4. హైదరాబాద్‌లో సిటీ బస్సులు రైట్‌.. రైట్‌

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలల సుధీర్ఘ విరామం తర్వాత నగరంలో సిటీ బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. దశల వారీగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలిదశలో కేవలం 25శాతం మాత్రమే సిటీ బస్సులు నడపనున్నారు.  గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లో సుమారు 2,900 బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ రీజియన్ లో 1,700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్‌లో 1,200 బస్సులు గతంలో నడిచేవి. వీటిలో ప్రస్తుతం 25శాతం బస్సులను నడపాలని సీఎం ఆదేశించడంతో సుమారు 650 బస్సులు నడవనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సూర్యప్రభ వాహనంపై దేవదేవుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజైన శుక్రవారం స్వామివారికి సూర్యప్రభ వాహనసేవ నిర్వహించారు. తిరుచ్చిపై సన్నిధి నుంచి కల్యాణ మండపానికి చేరుకున్న మలయప్పస్వామి సర్వాలంకారభూషితుడై సూర్యప్రభవాహనాన్ని అధిరోహించారు. శంఖు, చక్రం, గధ, అభయాహస్తం ధరించి చతుర్భుజ కేశవమూర్తి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హెచ్‌ 1బీ ఉద్యోగాల శిక్షణకు 150 మి.డాలర్లు

 తమ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే కీలక రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే హెచ్‌ 1బీ ఉద్యోగాలలో మానవవనరులకు శిక్షణ ఇచ్చేందుకు 150 మిలియన్‌ డాలర్లు వినియోగించనున్నట్టు అమెరికా కార్మికశాఖ వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ఐటీ, సైబర్‌ భద్రత, ఆధునిక నిర్మాణాలు, రవాణా తదితర ముఖ్య రంగాల్లో ప్రస్తుత, భవిష్యత్తులో అవసరమయ్యే మానవ వనరుల సామర్ధ్యం పెంపుదలకు ఈ ‘హెచ్‌ 1బీ వన్‌ వర్క్‌ఫోర్స్‌’ నిధులు వినియోగిస్తామని ఆ దేశ కార్మికశాఖ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రేమ వివాహం.. యువకుడి దారుణహత్య

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈవిషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో గతేడాది నవంబర్‌ నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ కలిసి బీహెచ్‌ ‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ యుద్ధాలకు అమెరికా స్వస్తి - ట్రంప్

అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని ‘విదేశీ యుద్ధాలకు’ ఇక అమెరికా దూరంగా ఉంటుందని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. విదేశీ యుద్ధాలను హాస్యాస్పదంగా అభివర్ణించిన ఆయన, ‘ఎప్పటికీ ముగియని’ అలాంటి యుద్ధాలకు అమెరికా దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, అమెరికన్లను బెదిరింపులకు పాల్పడే ఉగ్రవాదుల్ని మాత్రం అణచివేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం శాంతి ద్వారానే అమెరికా పునర్నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘అలా అయితేనే..ట్రంప్‌ ఫలితాల్ని స్వీకరిస్తారు’

9. ఎన్సీబీ విచారణకు హాజరైన రకుల్‌..!

నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తాజాగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తోన్న పోలీసులు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకుని గత కొన్నిరోజులుగా విచారణ చేస్తున్న విషయం విధితమే. విచారణలో భాగంగా రియా చక్రవర్తి, సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా వెల్లడించిన పలు విషయాలతోపాటు వారిద్దరికి చెందిన వాట్సాప్‌ సందేశాలను ఆధారంగా చేసుకుని రకుల్‌ ప్రీత్‌సింగ్‌, దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్రిస్‌ గేల్ ఎంట్రీ అప్పుడేనట!

పంజాబ్‌ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. గురువారం బెంగళూరును చిత్తుగా ఓడించిన రాహుల్‌ సేన మొదటి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో తృటిలో ఓటమిపాలైంది. దిల్లీతో మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ 89 పరుగులతో చెలరేగిపోగా, బెంగళూరుతో పోరులో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్వరూపం చూపించాడు. కేవలం కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులు సాధించాడు. ప్రస్తుతం పంజాబ్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే టీమ్‌లో భాగస్వామి అయిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ను మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడించలేదు. కాగా ఆ విధ్వంసకారుడి ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైదానంలో గేల్‌ ఎంట్రీ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.