close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/06/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆ అధికారం మాకుంది: ఎన్జీటీ

ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ డిపాజిట్‌ చేసిన రూ.50 కోట్లను పర్యావరణ పునరుద్ధరణ, పరిహారానికి వాడాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ కేసుకు సంబంధించి ఎన్జీటీ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పర్యావరణ పునరుద్ధరణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీ నుంచి ఒక్కొక్కరు, విశాఖ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని.. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నిసర్గ తుపాను: ఊపిరి పీల్చుకున్న ముంబయి

అరేబియా సముద్రంలో ఏర్పడిన నిసర్గ తుపాను సాయంత్రానికి బలహీన పడింది. రాత్రికి మరింత బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మధ్యాహ్నం రాయ్‌గడ్‌ జిల్లా అలీబాగ్‌ వద్ద ఈ తుపాను తీరం దాటింది. ఆ సమయంలో సుమారు 110 కి.మీ వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పటికే కరోనా కారణంగా విలవిల్లాడుతున్న ముంబయి నగరం తుపాను నుంచి బయటపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికారులపై వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం

వైకాపా ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప తన నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగంపై ఆనం విరుచుపడ్డారు. సీఎం లేఖకే దిక్కులేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాది వేచి చూస్తానని.. పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వెనకాడబోనని హెచ్చరించారు. జిల్లాలో వెంకటగిరి నియోజవర్గం కూడా ఒకటి ఉందని అధికారులు గుర్తించాలని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ అలవాటు రైతుల్లో రావాలి: కేసీఆర్‌

మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో నియంత్రిత విధానంలో పంటల సాగు వ్యూహంపై మూడు రోజులు విస్తృతంగా చర్చించిన సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పత్తి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రంగుల ఖర్చు వారినుంచే రాబట్టాలి

ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులకు అయిన ఖర్చును వైకాపా నేతల నుంచే రాబట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి రంగుల ఉదంతమే నిదర్శనమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కారం, అహంభావం, మూర్ఖత్వానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు ఆక్షేపించారు. తాము చేసిందే ఒప్పు అనేలా కోర్టుల్లో వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదని ఆయన దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జీ7కు మోదీని పిలిచిన ట్రంప్‌: చైనా అక్కసు

ప్రతిష్ఠాత్మక జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించడం చైనాకు కంటగింపుగా మారింది. రష్యా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియానూ ఆహ్వానిస్తామన్న డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించింది. బీజింగ్‌ చుట్టూ చిన్న వృత్తం గీసే ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని, జనాదరణ పొందవని అక్కసు వెళ్లగక్కింది. అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల బృందాన్ని జీ7 అంటారు. ఇందులో అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కెనడా సభ్య దేశాలుగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ట్రంప్‌-మోదీ సంభాషణతో ఉలిక్కిపడ్డ చైనా!

7. వీసా నిబంధనలు సడలించిన కేంద్రం 

కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వాటిలో కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ఇంజినీర్లు, ఆరోగ్య, సాంకేతిక సిబ్బంది భారత్‌కు వచ్చేందుకు అనుమతించింది. వీరిని హోంశాఖ నాలుగు కేటగిరీలుగా విభజించింది. వారంతా సొంత విమానాలు లేదా నాన్‌ కమర్షియల్‌ విమానాల్లో మాత్రమే భారత్‌కు వచ్చేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిసర్గ తుపాను: రన్‌వేపై జారిన విమానం

బెంగళూరు నుంచి ముంబయి చేరుకున్న ఫెడ్‌ఎక్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ఒకటి ముంబయి విమానాశ్రయంలో రన్‌వేపై జారింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదం వల్ల ఇతర విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకగం కలగలేదని ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌లో వైరస్‌ వివిధ రకాలుగా రూపాంతరం

చైనా, యూరప్‌లలో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌ రకమే రూపాంతరం చెంది భారత్‌లోనూ విస్తృతంగా వ్యాపించినట్లు జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. అలా కరోనా వైరస్‌ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 198 రకాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని తెలిపారు. దిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్‌ ఎక్కువగా రూపాంతరం చెందినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విన్నీతో స్టెప్పులేసిన శేఖర్‌..!

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ తన కుమారుడు విన్నీతో కలిసి స్టెప్పులేసి నెటిజన్లను ఆకట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా, షోల షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన ఆయన తనలోని ప్రతిభకు అన్నివిధాలుగా మెరుగులద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన కుమారుడు విన్నీతో కలిసి ‘రాములో రాములా’ పాటకు మాస్‌ స్టెప్పులేసి చూపరుల మనసు దోచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఇన్‌స్టా’ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.