close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ మేరకు ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. కరోనా వ్యాప్తికి ముందు ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్‌ చేసిన ఉన్నత విద్యామండలి తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసులు

నగరంలో ఇవాళ జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తనతో దురుసుగా ప్రవర్తించారని ఒకరు, దుర్భాషలాడారని మరొకరు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా యాచారంలో రహదారి శంకుస్థాపనకు వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొనబోయిన ఎమ్మెల్యేని యాచారం ఎంపీపీ సుకన్య అడ్డుకోబోయారు. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి తనతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పడకల సంఖ్య పెంచండి: సీఎం జగన్‌

రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఉన్న కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. కరోనా సోకడం పాపం, నేరం కాదని.. వైరస్‌ ఎవరికైనా వ్యాపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించి, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వారిపట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదు:ఉత్తమ్‌

లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుచూపు లేకుండా ప్రణాళిక రహితంగా విధించిన ఆంక్షలతో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగదు బదిలీ, ఆహార ధాన్యం పంపిణీ చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదన్నారు. కోట్ల మంది వలస కార్మికుల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక లేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మంచాన్ని మడిచి, శవపేటికగా మార్చి

 ‘మృతదేహాలను ఉంచడానికి మార్చురీలు ఖాళీగా ఉండటం లేదు. శవాలను పూడ్చి పెట్టడానికి ఎదురు చూడాల్సి వస్తుంది. చనిపోయిన వారి నుంచి వైరస్‌ ఎక్కడ సోకుతుందోనని అయినవాళ్లు, వైద్యులు భయపడాల్సిన పరిస్థితులు’.. కరోనా వైరస్‌ విజృంభించిన దగ్గరి నుంచి ఒక్కోసారి ఒక్కోదేశం ఇలాంటి క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. కొంచెం అటూ ఇటుగా ఇలాంటి దృశ్యాలే ఈక్వెడార్‌లోని గయాక్విల్‌లో కనిపిస్తున్నాయి. దాని పక్కదేశమైన కొలంబియాకు చెందిన వ్యాపారవేత్తకు ఆ దయనీయ స్థితులు ఆవేదన కలిగించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దేశంలోని థియేటర్లు ఒకే రోజు ఓపెన్‌ చేసేలా..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లను ఒకే రోజు ఓపెన్‌ చేసేలా నిర్ణయం తీసుకుంటాం. అలానే సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా, నిర్మాణం జరిగేలా.. రీజినల్ జీఎస్టీ గురించి కూడా ఆలోచిస్తాం’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘గ్రీన్’ చూపిస్తే..‘నో’ క్వారంటైన్‌

ఆరోగ్య సేతు యాప్‌లో ‘గ్రీన్’ స్టేటస్‌ చూపిస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి స్పష్టం చేశారు. మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆన్‌లైన్‌ ద్వారా నెటిజన్ల అనుమానాలను నివృత్తి చేశారు. గురువారం కూడా క్వారంటైన్‌ గురించి ఆయన ఇదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఈ ఇల్లు అంటే నాకెంతో ఇష్టం’: అమితాబ్‌

ఈ ఇల్లు అంటే నాకెంతో ఇష్టం’ అని అంటున్నారు బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌. ఆయుష్మాన్‌తో కలిసి ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘గులాబో సితాబో’. సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గులాబో సితాబో’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఓ పాత ఇంటి యజమానిగా వృద్ధుడి పాత్రలో అమితాబ్‌ విభిన్నంగా కనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కనీస సమయం 2-3 నెలలు: ఐసీసీ

క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఐసీసీ తెలిపింది. వైరస్‌ సమూహ వ్యాప్తి చెందే అవకాశముంటే క్రికెట్‌ను పునఃప్రారంభించొద్దని స్పష్టం చేసింది. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వెల్లడించింది. బౌలర్లు గాయపడకుండా ఉండేందుకు సూచనలు చేసింది.  ‘టెస్టు క్రికెట్‌ ఆడేందుకు కనీసం 8-12 వారాల సన్నద్ధత అవసరం (బౌలర్లకు). చివరి 4-5 వారాల్లో అంతర్జాతీయ స్థాయిలో తీవ్రత కొనసాగించాలి. తక్కువ సమయం సాధన చేసి ఆడితే బౌలర్లు గాయపడతారు. వయసు, శారీరక శ్రమను పరిగణనలోకి తీసుకొని శిక్షణ పొందాలి’ అని ఐసీసీ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపుతో ఏపీలో ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. తిరుపతి బస్టాండ్‌ ఆవరణలో ప్రయాణికులు ఆహారాన్ని తింటున్న కాకుల వద్దకు ఓ గద్ద వచ్చింది. తింటున్నఆహారాన్ని ఎత్తుకుపోతుందని భావించిన కాకి కాళ్లతో తన్నతూ, ముక్కుతో పొడుస్తూ గద్దను తరిమికొట్టిందిపూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.