close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5PM

1. కేసుల నమోదులో భారత్‌@ టాప్‌-5

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గడం లేదు. దీంతో ఒక్కరోజులో ఎక్కువగా కేసులు వెలుగు చూస్తున్న దేశాల జాబితాలో భారత్‌ టాప్‌-5లో నిలిచింది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత అత్యధికంగా భారత్‌లోనే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ గణాంకాలు ప్రస్తుతం కలవరపెడుతున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్థిరాస్తుల విక్రయానికి తితిదే ఉత్తర్వులు

తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి రెండు బృందాలను తితిదే ఏర్పాటు చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నాగబాబు ట్వీట్లపై పవన్‌ కామెంట్‌ 

 నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం. ఈ రోజు ఉదయం వాణిశ్రీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఎనిమిదేళ్ల వయసులో మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాట్సాప్‌ నుంచి మరో సరికొత్త ఫీచర్‌

 అత్యంత ప్రజాదరణ పొందిన మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ ఇప్పుడు మరో ఫీచర్‌ జోడించబోతోంది. సాధారణంగా ఎవరి ఫోన్‌ నెంబరైనా మన ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలంటే కాంటాక్ట్‌ మెనుకూ వెళ్లి అక్కడ టైప్‌ చేసి, యాడ్‌ కాంటాక్ట్‌ కొట్టి, ఆ పై పేరు సేవ్‌ చేసుకుంటాం. ఒకట్రెండు నెంబర్లైతే ఓకే. అదే పదుల సంఖ్యలో ఉంటే, ఇలాంటి సందర్భాల కోసమే వాట్సాప్‌ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మనుషులపై ప్రయోగించిన తొలి టీకా ఫలితాలివే..

మనుషుల్లో తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరిన మొట్టమొదటి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆశాజనక ఫలితాలిచ్చినట్లు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘ది ల్యాన్సెట్‌’లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే తటస్థ ప్రతిరక్షకాలను విడుదల చేసినట్లు వెల్లడించారు. అలాగే వైరస్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించే రోగనిరోధక వ్యవస్థలోని ‘టీ-సెల్స్‌’ సమర్థంగా ప్రతిస్పందించాయని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేసీఆర్‌ ధరిస్తున్న కండువాలకు భలే డిమాండ్‌

 తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల తెల్ల కండువా మెడలో వేసుకొని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సీఎం వేసుకుంటున్న కండువాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆయన మెడలో వేసుకుంటున్నవి సిరిసిల్ల సెల్లాలు. పల్లెల్లో ఇప్పటికీ పెద్దవారు సెల్లాలను ధరిస్తుంటారు. దుమ్మూధూళి సహా ఎండ నుంచి రక్షణ కోసం వీటిని వాడుతుంటారు. కరోనా వైరస్‌ వల్ల ఇప్పుడు ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరైంది. మాస్కులకు బదులుగా కొందరు దస్తీలు, తువ్వాలను కట్టుకుంటున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘మా రాష్ట్రానికి శ్రామిక్‌ రైళ్లు పంపొద్దు’

 పెను తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో తమ రాష్ట్రానికి మే 26 వరకు శ్రామిక్‌ రైళ్లను పంపొద్దని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా రైల్వే ఛైర్మన్‌ వీ.కే.యాదవ్‌కు లేఖ రాశారు. తుపాను కారణంగా రాష్ట్రంలో మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో జిల్లా యంత్రాంగాలన్నీ సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అనుకుంటే బీసీసీఐ గెలుస్తుంది!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూలు ప్రకారం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్‌ అన్నారు. ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ కోరుకుంటే మాత్రం మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచకప్‌ కష్టమేనని వెల్లడించారు. ‘ముందుగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బీసీసీఐ గెలుస్తుంది. అక్టోబర్లో ఐపీఎల్‌ నిర్వహించాలనుకుంటే వారికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌ జరగకపోవచ్చు’ అని ఛాపెల్‌ అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిక్కుల్లో అనుష్క శర్మ!

 బాలీవుడ్‌ నటి, నిర్మాత అనుష్క శర్మ నిర్మించిన తాజా వెబ్‌ సిరీస్‌ ‘పాతాళ్‌‌ లోక్‌’పై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీనిలో తమను అవమానకరంగా చిత్రీకరించారంటూ గూర్ఖా సమాజానికి చెందిన కొందరు ఆరోపించారు. ఈ మేరకు ‘ద ఆల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ గూర్ఖా యూత్‌ అసోసియేషన్‌’ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు అన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.