close

తాజా వార్తలు

Published : 23/07/2020 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చమురు బావినుంచి మరోసారి భారీగా మంటలు

ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

తిన్‌సుకియా: అసోంలోని తిన్‌సుకియా జిల్లా బాఘ్‌జన్‌లో ఉన్న ఆయిల్‌ ఇండియా సంస్థ (ఓఐఎల్‌) చమురు బావి నుంచి మరోసారి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడినట్లు కంపెనీ సీనియర్‌ మేనేజర్‌ జయంత బర్ముడోయి వెల్లడించారు. గత నెల రోజులుగా ఈ బావి నుంచి ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసే ప్రయత్నంలో వీరు గాయపడినట్లు తెలిపారు.

ఈ చమురు బావిలో మే 28 నుంచి నిరాటంకంగా గ్యాస్‌ విడుదలవుతోంది. జూన్‌ 9 నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో ఇప్పటికే ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. దీంతో విదేశాల నుంచి నిపుణలను తెప్పించి మరీ మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో మంటలను అదుపు చేసే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.