close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/05/2020 20:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

 తొలి ఎలక్ట్రిక్‌ విమానం ఎగిరింది

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ విమానం ప్రయోగం విజయవంతమైంది. ఈ సాంకేతిక యుగంలో ఆవిష్కరించిన తొలి భారీ ఎలక్ట్రికల్‌ విమానం వాషింగ్టన్‌ నుంచి ఆకాశంలో తొలిసారి విజయవంతంగా ఎగిరింది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రయాణించింది. సెస్నా -208 క్యారవాన్‌ అనే ఈ విమానాన్ని పూర్తి ఎలక్ట్రికల్‌ ఇంజిన్‌తో తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చొనే విధంగా అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్‌ అనే సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. దీనిలో 750 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్‌ను అమర్చారు. అయితే, ఈ విమానం మోసెస్‌ సరస్సు వద్ద ల్యాండ్‌ అయ్యే ముందు దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరిందని మాగ్ని ఎక్స్‌ సంస్థ తెలిపింది. కానీ, ఈ ప్రయోగం సమయంలో మాత్రం ఒక్క పైలట్‌ మాత్రమే గంటకు 183 కి.మీల వేగంతో దీనిలో ప్రయాణం చేశారని తెలిపింది. 2021 నాటికి ఈ విమాన కమర్షియల్‌ సర్వీసులను అందుబాటులోకి తేవాలని మాగ్ని ఎక్స్‌ సంస్థ భావిస్తోంది. వాషింగ్టన్‌ నగరం రెడ్మాండ్‌లోని మాగ్ని ఎక్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ సీటెల్‌లోని ఏరోటెక్‌ అనే ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సర్టిఫికేషన్ సంస్థతో కలిసి పనిచేస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.