చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు
close

తాజా వార్తలు

Updated : 29/01/2020 14:39 IST

చైనాలో చిక్కుకున్న తెలుగు ఇంజినీర్లు

వుహాన్‌: చైనాలోని కరోనా వైరస్‌ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకూ తాకింది. చైనాలోని వుహాన్‌ నగరంలో తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లు చిక్కుకుపోయారు. ప్రాంగణ నియామకాల ద్వారా శ్రీసిటీలోని టీసీఎల్‌ కంపెనీకి ఎంపికైన వీరంతా..శిక్షణ నిమిత్తం వుహాన్‌కు వెళ్లారు. సదరు సంస్థ మొత్తం 96 మందిని 3 నెలల శిక్షణకోసం చైనాకు పంపించింది. ఆగస్టు 2019లో చైనా వెళ్లిన వారిలో 38 మంది నవంబర్‌లోనే తిరిగివచ్చారు. మిగిలిన 58 మంది వుహాన్‌లోని కంపెనీ హాస్టల్‌లోనే ఉండిపోయారు. కరోనా వైరస్‌ ప్రబలిన తరుణంలో స్వస్థలాలకు చేరుద్దామని సంస్థ ప్రయత్నించినప్పటికీ అప్పటికే నిషేధం అమల్లోకి రావడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. వారిని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చదవండి..

చైనా‘కరోనా’.. జీవాయుధమేనా?

రక్షించండి... వుహాన్‌లో భారతీయ విద్యార్థులు

పదిరోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం?

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని