close

తాజా వార్తలు

Published : 13/08/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో సడలింపులు

హెచ్‌-1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. ఆ వీసాలకు సంబంధించిన నిబంధనల్లో స్వల్ప సడలింపులు ఇచ్చారు. దానిలో భాగంగా వీసా నిషేధం కంటే ముందు చేసిన ఉద్యోగాల్లోకి తిరిగి వచ్చే వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని ఆ దేశ‌ ప్రభుత్వం వెల్లడించింది.  వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని అమెరికా‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆందోళనకరంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని గురువారం ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ‘ఈ రోజు ఉదయానికి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన కోమాలో ఉన్నారు. వెంటిలేటర్ మీదనే ఆయనకు చికిత్స అందిస్తున్నాం’ అని ఆర్మీ రీసెర్చ్‌, రెఫెరల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  ప్రత్యక్ష పన్నులపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపన్ను వ్యవస్థలో సంస్కరణలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారికత లభించే విధంగా ఓ కొత్త వేదికకు శ్రీకారం చుట్టినట్లు కేంద్రం ప్రకటించింది. ‘పారదర్శక పన్ను విధానం’ను ఉదయం 11 గంటలకు ప్రధాని వీడియో సమావేశ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా పరీక్షల సంఖ్య పెంచాం: సీఎస్‌

 తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్కరోజే 67వేల కేసులు, 942మంది మృతి!

భారత్‌లో కరోనా వైరస్‌తో మరణిస్తున్న వారి సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 900మందికి పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో అత్యధికంగా మరో 942 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 47,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో 1,931 కరోనా కేసులు

6. తెలంగాణలో పారిశ్రామిక వృద్ధి: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌  అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి కేటీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘మేధా’ వల్లే తెలంగాణకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కమలా హారిస్‌కు ఆ పిలుపంటే ఇష్టమట!

 అమెరికాలో నవంబర్‌లో జరగనున్న ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు అవకాశం లభించింది. అధ్యక్షపదవి రేసులో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌, తమ పార్టీ తరపు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె, తొలి ఉపన్యాసంలో తన భారతీయతను గురించి ప్రస్తావించి పలువురిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* PICS: కమలా హారిస్‌ ఆసక్తికర ఫొటోలు

8. కరోనా కాలంలో ఇదీ ‘బడి’!

ఇది కరోనా కాలం.. ఈ వైరస్‌ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. విద్యా రంగానికి కొవిడ్‌ కొత్త పరీక్ష పెట్టింది. పరీక్షలు, కౌన్సెలింగ్‌లు, ప్రవేశాలతో హడావుడిగా సాగాల్సిన విలువైన సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మాస్క్‌లు, శానిటైజర్లు వైపు పరుగులు పెట్టేలా చేసింది. తమ పిల్లల చదువులు ఏమైపోతాయో అనే ఆందోళనను మిగిల్చింది. విద్యా ప్రణాళికతో పాటు బడులు స్వరూపాన్నే మార్చేసింది. ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పవన్‌ ఆ మలయాళ సినిమా చేస్తారా?

ఈ మధ్య కాలంలో తెలుగువాళ్ల నోళ్లలో నానిన మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’. బిజు మేనన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా అది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని పరిశ్రమల వాళ్లు రీమేక్‌ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ఆ సినిమా హక్కుల్ని తీసుకుంది. అప్పటి నుంచి అందులో వీళ్లు నటిస్తారు, వాళ్లు నటిస్తారు అంటూ వార్తలైతే వస్తున్నాయి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఇప్పుడు అదిరిపోయే న్యూస్‌ ఒకటి బయటికొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అసలు.. ధోనీకి ఆడాలని ఉందా? 

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ భవితవ్యంపై రోజుకో వార్త ప్రచారం అవుతోంది. అతడు ఆటకు దూరమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. దాంతో అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈవో విశ్వనాథన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ మహీ 2022 వరకు ఐపీఎల్‌ ఆడతాడనే విషయాన్ని పేర్కొన్నారు. దాంతో అభిమానులకు కాస్త ఊరట లభించినట్లు అయింది. ఐపీఎల్‌ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు చర్చంతా అంతర్జాతీయ క్రికెట్‌వైపు మళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.