close

తాజా వార్తలు

Updated : 08/08/2020 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. సుప్రీంలో స్టే వెకేషన్‌ పిటిషన్‌ వేసిన ఏపీ ప్రభుత్వం

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టే వెకేషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. తమ విదనలూ వినాలని ఇప్పటికే రైతులు, అమరావతి ఐకాస కేవియట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 14వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ లభ్యం

కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు.. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నా చేతులు, చొక్కా రక్తంతో తడిసిపోయాయి..!  

3. భారత్‌లో కరోనా@ రెండోరోజూ 60వేలు దాటాయ్‌..

కరోనా మహమ్మారి విజృంభణ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నడూ లేనంతగా వరుసగా రెండో రోజూ 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.04%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏమిటీ టేబుల్‌టాప్‌ రన్‌వే? ఎక్కడున్నాయి? 

 కొలికోడ్‌ ఘోర విమాన ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన  సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు  విమానాశ్రయంలో ప్రమాద ఘటనను గుర్తుకు తెచ్చింది. 2010లో మంగళూరులో జరిగిన ఘటన గుర్తుందా? అక్కడా, ఇక్కడా జరిగిన ప్రమాదాలు టేబుల్‌ టాప్‌ రన్‌వేలపైనే  జరిగాయి. దీంతో వీటిపై చర్చమొదలైంది. టేబుల్‌టాప్‌ రన్‌వే.. పేరుకు తగినట్టుగానే టేబుల్‌ ఉపరితలం మాదిరిగానే ఉంటాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ తరహా రన్‌వేలను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ముందు, వెనుకా కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లో ఉండే రన్‌వేలతో పోలిస్తే వీటి నిడివి కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కాగ్‌గా ప్రమాణస్వీకారం చేసిన ముర్ము

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భయపడినట్లే జరిగింది..

కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదాన్ని గతంలోనే ఊహించామని వైమానిక రంగ నిపుణులు వెల్లడించారు. ఈ విమానాశ్రయం కొండలపై ఉందని, రన్‌వేకు ఇరువైపులా లోయలున్నాయని వారు గుర్తు చేశారు. దీనికి తోడు లైటింగ్‌ కూడా ఎక్కువగా ఉండదని వారు చెప్పారు. దీనిపై గతంలోనే తాము అనేకసార్లు సంబంధిత అధికారవర్గాలకు  విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తండ్రి మరణం తట్టుకోలేక ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబకలహాలు ఓ తండ్రి, ఇద్దరు కమార్తెల ఆత్మహత్యలకు పురిగొల్పాయి. తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఇద్దరు కమార్తెలు రైలు కింద పడి మరణించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మయమ్మార్‌ కాలనీకి చెందిన బాబురెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కమార్తె భర్త వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన బాబురెడ్డి నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8.  ‘వంద బిలియన్ డాలర్’ క్లబ్‌లో జుకర్‌బర్గ్‌

 సోషల్‌ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘వంద బిలియన్ డాలర్’ క్లబ్‌లో స్థానం సంపాదించుకున్నారు. తద్వారా సాంకేతిక దిగ్గజాలైన అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సరసన నిలిచారు. టిక్‌టాక్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ కొత్త వీడియో యాప్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనితో ఫేస్‌బుక్‌ షేర్ల విలువ గురువారం నాటికి ఆరు శాతానికి పైగా పెరిగింది. ఫేస్‌బుక్‌లో 13 శాతం వాటా జుకర్‌బర్గ్‌ ఆధీనంలో ఉండటంతో.. ఆయన సంపద విలువ 100 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 2020 దయచేసి కనికరించు..

కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు స్పందించారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌ నుంచి కొలికోడ్‌కు చేరుకున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై దిగబోతూ పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. PICS : రానా-మిహీక పెళ్లి సందడి

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు రాత్రి 8.30 గంటలకి  యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో  మూడు ముళ్లు వేయనున్నారు. ఈ వేడుకకు రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. వివాహానికి సంబంధించి ముందస్తు వేడుకలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా రానా-మిహీకాల ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.