close

తాజా వార్తలు

Updated : 12/08/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. వ్యాక్సిన్‌ సిద్ధం

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి శుభవార్త. ప్రాణాంతక కొవిడ్‌ మహమ్మారిపై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది. ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. ఇది సమర్థంగా పనిచేస్తోందని, కొవిడ్‌-19 నుంచి స్థిరంగా రక్షణ కల్పిస్తోందని పేర్కొన్నారు. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీకా అభివృద్ధి.. ప్రపంచానికి ఒక పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘కరోనా’ వ్యాధికి మరొక ఔషధం!

2. హిందూ అవిభక్త కుటుంబంలో ఆడపిల్లలకూ ఆస్తి హక్కు

హిందూ అవిభక్త కుటుంబ ఆస్తులకు కుమారులతో పాటు కుమార్తెలు కూడా సమాన హక్కుదారులేనని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. వారికి సమానత్వ హక్కును దక్కకుండా చేయడం కుదరదని తేల్చింది. ‘హిందూ వారసత్వ (సవరణ) చట్టం-2005’ అమల్లోకి రావడానికి ముందు నుంచీ ఇది వర్తిస్తుందని తీర్పునిచ్చింది. 2005, సెప్టెంబరు 9కి ముందు పుట్టిన కుమార్తెలూ అవిభాజ్య కుటుంబ ఆస్తులకు సమాన హక్కుదారులేనని పేర్కొంది. అప్పటికి వారి తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా వైద్యంపై ఇప్పుడు మరింత స్పష్టత

వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స అందించాలనే విషయంలోనూ స్పష్టత ఏర్పడింది. సరైన సమయంలో చికిత్స అందించడం వల్ల మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కరోనా కేసుల సంఖ్య పెరగడం, కొందరు మృతి చెందడం వంటివి చూసి ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీఈ) ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి సూచించారు. గత నాలుగు నెలలతో పోల్చితే.. ఇప్పుడు మన దేశంలో ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (11వ తేదీన) 1,897 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో  9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 654కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పరీక్షలు పెంచండి.. మరణాలు తగ్గించండి

5. కూటమిగానే డ్రాగన్‌కు కళ్లెం!

ప్రపంచవ్యాప్తంగా ప్రచ్ఛన్నయుద్ధ ప్రకంపనలు మొదలయ్యాయి. టీకా పరిశోధనకు సంబంధించిన కీలకాంశాలను తస్కరిస్తోందన్న ఆరోపణలపై హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్‌ జనరల్‌ ఆఫీస్‌ను అమెరికా మూసేయించింది. అందుకు ప్రతిగా చైనాలోని చెంగ్డూలో అమెరికా దౌత్యకార్యాలయ అనుమతుల ఉపసంహరణ శరవేగంగా జరిగిపోయింది. అదే సమయంలో దక్షిణ చైనా సముద్రం వేదికగా ఇరు దేశాలు బలప్రదర్శనకు దిగాయి. అమెరికా ఎన్నికలకు మూడు నెలల ముందు చోటు చేసుకొన్న ఈ పరిణామాలు చైనాతో సంబంధాలు పతనమవుతున్న విషయాన్నే వెల్లడిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణను ఆపలేదేం!

 రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. తెలంగాణ కొత్త ప్రాజెక్టులు కడుతుంటే మాత్రం ఎప్పుడూ అడ్డు చెప్పలేదేమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. కొత్త ఆయకట్టు కోసం తెలంగాణ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నా 2016 నుంచి ఇంతవరకు అపెక్స్‌ కౌన్సిల్‌ వాటిని ఆపాలని ఎన్నడూ ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని, దానికింద కొత్త ఆయకట్టు, కొత్త జలశయాలు, కొత్త కాలువలు కూడా లేవన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జీతాల వాయిదా చట్టవిరుద్ధం

7. నిరవధికంగా రైళ్ల రద్దు

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో సాధారణ, లోకల్‌(సబర్బన్‌) రైళ్లను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ మంగళవారం తెలిపింది. సెప్టెంబరు 30 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు జోనల్‌ రైల్వేలు జారీచేసిన సర్క్యులర్లను సోమవారం ఖండించిన రైల్వేశాఖ.. మంగళవారం ఈ ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఈ రద్దు అమల్లో ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాధారణ రైళ్లను ఆగస్టు 12వరకు రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల గడువు సమీపించడంతో రైల్వేశాఖ ఈ ప్రకటన చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆమె మీట నొక్కితే...తూటాల వర్షమే!

సుఖోయ్‌ యుద్ధ విమానాల పేరుచెబితే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి..అలాంటి ప్రతిష్ఠాత్మక యుద్ధవిమానాలకి.. వెపన్‌సిస్టమ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపడుతోంది తేజస్విని. ఇదేమంత తేలికైన బాధ్యత కాదు. ఇంతవరకూ అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలు మాత్రమే మహిళలని ఈ స్థాయిలో ఆఫీసర్‌గా నియమించాయి. ఆ తర్వాత మనదేశం నుంచి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న మొదటి మహిళ తేజస్వినీ రంగారావు... విజో... ఈ పదాన్ని ఇంతవరకు పెద్దగా వినిఉండరు. తేజస్వినీరంగారావు మనదేశం నుంచి మొదటి మహిళా విజోగా మారిన తర్వాత మాత్రం అందరికీ సుపరిచితం అవుతోంది. ఇంతకీ విజో అంటే ఏంటనేగా మీ సందేహం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

మగువ కాదు.. మొక్కజొన్న కంకి

9. బంగారు కొండ దిగుతోంది

ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్‌ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,600కు దిగి వచ్చింది. ఇటీవల కాలంతో  ఇది గరిష్ఠంగా రూ.58250కు చేరడం గమనార్హం. ఇదేవిధంగా కిలో వెండి ధర కూడా ఇటీవలి గరిష్ఠమైన రూ.76000 నుంచి రూ.67,000 కిందకు పరిమితమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​​​​​​​​

10. కుక్క తెచ్చిన పేచీ

పక్కింటి కుక్క ఇంట్లో చొరబడి అన్నం తినేసిందన్న కారణంతో ఇరుపొరుగు మధ్య జరిగిన గొడవ ఓ కుటుంబ పెద్ద ప్రాణం పోవడానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం జరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు...ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామానికి చెందిన పద్దం జోగులు(50), కూరం వీరస్వామి ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తుంటారు. ఆదివారం రాత్రి వీరస్వామి పెంపుడు కుక్క, జోగులు ఇంట్లో చొరబడి వండుకున్న అన్నం కాస్తా తినేసింది. గమనించిన జోగులు భార్య బజారమ్మ దాన్ని కొట్టడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.