close

తాజా వార్తలు

Updated : 10/08/2020 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. నిర్లక్ష్యమే నిప్పై

వారంతా కరోనా చికిత్సల కోసం అక్కడకు వచ్చారు.. వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లిపోతామనుకున్నారు. అంతలోనే నిర్లక్ష్యపు మంటలు వారిని కమ్ముకున్నాయి. గాఢ నిద్ర నుంచి కళ్లు తెరిచేలోపే అప్పటికే అలసిన ఊపిరితిత్తుల నిండా పొగ కమ్ముకుంది. ఆదుకునే ఆపన్నులు వచ్చేలోపే వాళ్ల బతుకులు తెల్లారిపోయాయి. కొవిడ్‌ సంరక్షణ కేంద్రంగా మారినవిజయవాడ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామునే చెలరేగిన మంటలు.. పది నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆసుపత్రి నిర్లక్ష్యమా

2. పల్లే బువ్వ పెడుతోంది

పల్లె తల్లివంటిది... పట్నం ప్రియురాల్లాంటిదంటారు! కరోనా పుణ్యమా అని అది అనుభవంలోకి వచ్చింది చాలామందికి! కాసుల వేటో... కెరీర్‌ పాటో పాడుకుంటూ... తనను వదిలివెళ్ళిన చాలామందికి కరోనా కాలంలో మళ్ళీ ఆ పల్లెనే తల్లిలా ఆదరిస్తోంది. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. తనకలవాటైన రీతిలో ఉన్నదాంట్లోనే కలోగంజి అంటూ.. ఆకలి తీరుస్తుంది. నాడు పల్లెల్లో పనుల్లేవంటూ పట్టణాలకు వలస బాట పట్టిన బిడ్డలు ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభంతో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగొస్తుంటే సంతోషంగా పల్లె స్వాగతం పలుకుతోంది. ఏదో ఒక పని చూపిస్తూ.. అమ్మప్రేమను పంచుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆశలు ఆహుతి

కరోనా భయపెట్టిస్తున్న వేళ.. ఎంతో ఆత్మవిశ్వాసంతో చికిత్స పొందుతూ వారు కుదుట పడుతున్నారు. ఇంటికి చేరుకునేందుకు గంటలు లెక్కిస్తూ భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఊహించని విధంగా వారిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. తెల్లవారుజామునే  దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. వాటి ధాటికి కొందరు కట్టెల్లా కాలిపోయారు.  మరికొందరు తీవ్రగాయాలతో తల్లడిల్లారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల సమిధలయిన ఒక్కొక్కరిది ఒక్కో దయనీయ గాథ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జగన్‌తో సత్సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో తమకు సత్సంబంధాలున్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. కృష్ణా జలాల్లో చట్టబద్ధమైన రాష్ట్ర హక్కుల కోసం పూర్తి స్థాయిలో పోరాడతామన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు, గౌరవం లభించే రామ రాజ్యం రావాలన్నది తన కోరికని, అందుకు ప్రార్థిద్దామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యాంటీజెన్‌తో మమ!

5. హలధారికి అండ

ఆరుగాలం శ్రమించి అన్నం పెడుతున్న రైతులకు అండదండగా ఉండేందుకే కేంద్రం రూ.లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ప్రభుత్వం అందించే సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే పీఎం కిసాన్‌ నిధి ఆరో విడత కింద 8.5 కోట్ల మంది రైతులకు రూ.17 వేల కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. హలధారి బలరాముడి జయంతి అయిన ‘హల షష్ఠి’ని పురస్కరించుకొని ప్రధాని ఆదివారం రూ.లక్ష కోట్ల నిధితో చేపట్టే కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు

భక్తులకు త్వరలోనే సర్వదర్శనం టోకెన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారులతో చర్చించి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం. ఈనెలాఖరున నిర్వహించే తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిబంధనల సడలింపుల ఆధారంగా వృద్ధులు, చిన్నారులకు దర్శనం కల్పించడంపై నిర్ణయం తీసుకుంటాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. అత్యుత్తమ నాణ్యతతోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌

త్వరగా అభివృద్ధి చేయాలనే ఒత్తిడి ఉన్నా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల్లో, సురక్షితంగా, అందుబాటు ధరలో ఆవిష్కరిస్తామని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ కృష్ణ ఎల్ల చెప్పారు. ‘కొవిడ్‌ వ్యాప్తి విజృంభిస్తున్నందున, వ్యాక్సిన్‌ను త్వరగా ఆవిష్కరించాలనే ఒత్తిడి కంపెనీపై ఉంది. అయితే భద్రత, నాణ్యతలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోం’ అని కొవిడ్‌ వ్యాక్సిన్‌పై చెన్నై ఇంటర్నేషనల్‌ సెంటర్‌ సభ్యులతో జరిగిన చర్చాగోష్ఠిలో ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇంకొన్నాళ్లు సోనియానే

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరికొన్నాళ్లపాటు కొనసాగనున్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు వచ్చే వరకు ఆమే పదవిలో కొనసాగుతారని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ స్పష్టం చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా ఏడాది పదవీ కాలం సోమవారంతో ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సింఘ్వీ మాట్లాడుతూ.. మరికొంతకాలం సోనియానే కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. తల్లి పాలతో కరోనా సోకదు

ఒకవేళ తల్లికి కరోనా ఉన్నా నిరభ్యంతరంగా బిడ్డకు పాలు ఇవ్వవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తల్లిపాల ద్వారా కరోనా సోకదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్నే చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అయితే పాలు ఇచ్చేటప్పుడు మాస్కులు, గ్లౌజులు ధరించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పాలు ఇవ్వలేని పరిస్థితిలో తల్లి ఉంటే బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకుల నుంచి పాలు తెప్పించి పిల్లలకు పట్టవచ్చని చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

చేనేత మాస్కే సురక్షితం

10. తండ్రి ఆసుపత్రిలో.. బట్లర్‌ మైదానంలో

అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి ఎలా ఉన్నాడోననే భయం ఓ వైపు.. వరుసగా విఫలమవుతుండటంతో జట్టులో స్థానం పోతుందేమోనన్న ఒత్తిడి మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ గొప్ప పట్టుదల ప్రదర్శించాడు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని విలువైన అర్ధశతకంతో తన జట్టును విజయం దిశగా నడిపించాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను చేసిన 75 పరుగులు ఇంగ్లాండ్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.